‘జీ5’ బంపర్ ఆఫర్..!!

Posted By: Super

‘జీ5’ బంపర్ ఆఫర్..!!


‘‘టాబ్లెట్ పీసీల అమ్మకాల్లో అత్యధిక వాటాను వసం చేసుకున్న ఇండియన్ మార్కెట్లు సాంకేతిక పరికరాల అమ్మకాలకు స్వర్గధామంలా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి సొంత గూటి బ్రాండ్ల వరకు మార్కెట్ ను చేజిక్కుంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘జీ5’ ఓ బంపర్ ఆఫర్ ను భారతీయ వినయోగదారులకు అందించనుంది. రూ.10,000లో మన్నికైన టాబ్లెట్ పరికరాన్ని వినియోగదారులకు అందించనుంది. ఇప్పటికే భారతీయ వినియోగదారుల విశ్వాసాన్ని చొరగున్న ‘జీ5’ టాబ్లెట్ పీసీలతో పాటు నెట్‌బుక్, ల్యాప్‌టాప్, డిజిటల్ ఫోటో ఫ్రేమ్ వంటి గ్యాడ్జెట్లను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది.’’

క్లుప్తంగా జీ5 ఫీచర్లు:

- తాజాగా విడుదలైన బీటెల్ మ్యాజిక్ టాబ్లెట్ పీసీకి దీటుగా విడుదల కాబోతున్న ‘జీ5’ టాబ్లెట్ పీసీ రూపుదిద్దుకున్నట్లు విశ్వసనీయ వర్గాల
సమాచారం.
- ఈ నెలాఖరులో విడుదల కాబోతున్న ‘జీ5’కి సంబంధించి పలు ఫీచర్లను గోప్యంగా ఉంచారు.
- 7 అంగుళాల టచ్ స్ర్ర్కీన్ సామర్ధ్యం, 3జీ వ్యవస్ధ, ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ వ్యవస్థ, నాణ్యమైన కెమెరా వ్యవస్థలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot