ఆ మూడుంటిని కలగలపి..?

Posted By: Staff

ఆ మూడుంటిని కలగలపి..?

 

డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ పీసీల ఫీచర్లను కలగలుపుతూ ‘జిగాబైట్ కంప్యూటర్స్’ సంస్థ బుక్ టాప్ T1132N పేరుతో ఓ కంఫర్టబుల్ కంప్యూటింగ్ డివైజును మార్కెట్‌కు పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికతతో తాము చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తుందని సంస్థ అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రొఫెషనల్ లుక్స్‌తో చూపరుల మదిని దోచే ‘జిగాబైట్ T1132N బుక్‌టాప్’ నలుపు, తెలుపు రంగుల్లో లభ్యమవుతుంది. చట్టు కొలతలు 290 mm x 220.7 mm x 27.86 ~ 40 mm (WxDx H). బరువు 1.76 కిలో గ్రాములు, అత్యాధునిక కీబోర్డ్ మరియు ట్రాక్ ప్యాడ్.

స్క్ర్రీన్ సైజ్ 11.6 అంగుళాల, మల్టీ టచ్ సామర్ద్యం, సెకండ్ జనరేషన్ ఇంటెల్ i5 -2467 M ప్రాసెసింగ్ వ్యవస్థ, ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.66GHz నుంచి 2.3GHz వరకు, 2జబీ, 4జీబీ ర్యామ్ లను నిక్షిప్తం చేసుకునే విధంగా రెండు అత్యాధునిక ర్యామ్ స్లాట్స్, సిస్టం గరిష్ట మెమరీ సామర్ధ్యం 8జీబీ, ఇంటెల్ HM65 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్ వ్యవస్థ, ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్ వ్యవస్థ, న్విడియా జీ ఫోర్స్ GT 520M గ్రాఫిక్ కార్డ్ , గ్రాఫిక్ మెమరీ 1జీబీ.

రెండు ఇంటిగ్రేటెడ్ వెబ్ స్పీకర్లు, 1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా, కనెక్టువిటీ అంశాలను మరింత పటిష్టితం చేస్తూ యూఎస్బీ 2.0 మరియు 3.0 పోర్ట్సు, కార్డ్ రీడర్, హెచ్డీఎమ్ఐ అవుట్ పోర్టు సౌలభ్యత. నిక్షిప్తం చేసిన 6 సెల్ లితియమ్ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్ ను అందిస్తుంది. ఈ గ్యాడ్జెట్ భారతీయ మార్కెట్లో విడుదల, ధర అంశాలకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting