ప్రపంచంలోనే లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌!

Posted By: Prashanth

ప్రపంచంలోనే లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌!

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ గిగాబైట్ అత్యంత తక్కువ బరువుతో కూడిన ల్యాప్‌టాప్‌‌ను డిజైన్ చేసింది. 975 గ్రాముల బరువు కలిగిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ మోడల్ ‘X11’. ల్యాపీ స్ర్కీన్ పరిమాణం 11.6 అంగుళాలు. సులువుగా క్యారీ చేసే తత్వం.

ల్యాపీ పూర్తి ఫీచర్లు:

975గ్రాముల అల్ట్రాలైట్ వెయిట్,

11.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

4జీబి డీడీఆర్3 ర్యామ్,

128జీబి సాలిడ్ స్టేట్‌డ్రైవ్,

1.3మెగా పిక్సల్ వెబ్ క్యామ్,

ఇంటెల్ హెచ్ఎమ్67 ఎక్స్ ప్రెస్ చిప్ సెట్,

ఇంటెల్ హై డెఫినిషన్ 400 గ్రాఫిక్ అవుట్ పుట్,

మైక్రో ఎస్డీ, యూఎస్బీ 3.0, కాంబో ఆడియో,

వై-ఫై,

బ్లూటూత్ 4.0,

7.4వీ 4730 ఎమ్ఏహెచ్ లి-యోన్ పాలిమర్ బ్యాటరీ.

నిక్షిప్తం చేసిన సరికొత్త ఇంటెల్ కోర్ ప్రాసెసర్ రెట్టింపైన ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. పొందుపరిచిన 4జీబి డీడీఆర్3 ర్యామ్ మల్టీటాస్కింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తుంది. ఏర్పాటు చేసిన ఇంటెల్ హైడెఫినిషన్ 4000 గ్రాఫిక్ వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ గ్రాఫిక్‌లను విడుదల చేస్తుంది. స్టోరేజ్ అంశాలను పరిశీలిస్తే అమర్చిన 128జీబీ ఎస్ ఎస్ డీ డ్రైవ్ ల్యాపీ మెమెరీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. వై-ఫై కనెక్టువిటీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను సజావు చేస్తుంది. బ్లూటూత్ అదేవిధంగా యూఎస్బీ పోర్టుల సాయంతో డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ధర అంచనా రూ.50,000 నుంచి 65,000మధ్య.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot