బెస్ట్ క్లాస్ గేమింగ్ కోసం Gigabyte Z370 AORUS మదర్‌బోర్డ్

|

ప్రముఖ మదర్‌బోర్డ్స్ తయారీ కంపెనీ గిగాబైట్ టెక్నాలజీ సరికొత్త Gigabyte Z370 AORUS మథర్‌బోర్డ్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ బోర్డ్ ఇంటెల్ జెడ్370 చిప్‌సెట్ ఆధారంగా స్పందిస్తుంది.

 
Gigabyte Z370 AORUS motherboards unveiled: Supercharge your gaming experience

8th generation ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లను సపోర్ట్ చేసే విధంగా సర్వర్-గ్రేడ్ డిజిటల్ పవర్ డిజైన్‌ను ఈ మదర్‌బోర్డ్‌లో గిగాబైట్ టెక్నాలజీస్ ఎక్విప్ చేసింది. 4133MHz రేటెడ్ మెమురీ మాడ్యుల్స్‌తో ఈ మదర్‌బోర్డ్‌ పనిచేయగలదు. ESS Sabre DAC, Smart Fan 5, RGB Fusion వంటి విప్లవాత్మక ఫీచర్లతో Z370 AORUS అల్టిమేట్ గేమింగ్ మథర్‌‌బోర్డ్‌గా అవతరించింది.

ప్రత్యేకించి గేమర్స్ కోసం..

ప్రత్యేకించి గేమర్స్ కోసం..

ఇంటెల్ జెడ్370 చిప్‌సెట్ ప్లాట్‌ఫామ్ కోసం సంచలనాత్మక మదర్‌‍బోర్డును అభివృద్ధి చేసినట్లు గిగాబైట్ మదర్‌బోర్డ్ టెక్నాలజీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ విన్సెంట్ లియు తెలిపారు. ప్రత్యేకించి గేమర్స్ కోసం డిజైన్ చేయబడిన Z370 AORUS మదర్‌బోర్డులు 8వ తరం ఇంటెల్ ప్రాసెసర్‌ల కాంభినేషన్‌తో అత్యుత్తమ పనితీరును కనబరుస్తాయి.

14nm టెక్నాలజీతో డిజైన్ చేయబడిన ఈ 8th gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లు 4-కోర్స్ అండ్ 4 త్రెడ్స్, 6-కోర్స్ అండ్స్ 12 త్రెడ్స్ రేంజింగ్‌‌తో ఉంటాయి. ఈ మదర్‌బోర్డ్స్‌లో నిక్షిప్తం చేసిన HDCP 2.2 టెక్నాలజీ, HEVC 10-bit డీకోడర్, VP9 hardware డీకోడర్ వంటి ఫీచర్లు హైక్వాలిటీ వీడియోలను డెలివరీ చేస్తాయి.

అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యాధునిక ఫీచర్లు..
 

అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యాధునిక ఫీచర్లు..

Z370 AORUS మదర్‌బోర్డ్స్ సరికొత్త VRM అలానే PWM డిజైన్‌లను యుటిలైజ్ చేసుకుని 60 amps పర్ పవర్ ఫేజ్‌ను డ్రైవ్ చేయటంతో పాటు ప్రాసెసర్ అలానే వోల్టేజ్ రెగ్యులేటర్ మధ్య సిగ్నల్‌ను మరింత బలోపేతం చేస్తాయి.

ఈ మదర్ బోర్డుతో పెయిర్ చేసిన ESS Sabre DAC అలానే క్రియేటివ్ సౌండ్ BlasterX 720 సాఫ్ట్‌వేర్‌లు హైక్వాలిటీ ఆడియోను ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా మల్టీప్లేయర్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అదిరిపోయే విధంగా ఉంటుంది.

వెనక్కి తగ్గిన వాట్సాప్, మళ్లీ అందుబాటులోకి old status సదుపాయంవెనక్కి తగ్గిన వాట్సాప్, మళ్లీ అందుబాటులోకి old status సదుపాయం

 ఫ్యాన్ స్టాప్ కూలింగ్ టెక్నాలజీతో..

ఫ్యాన్ స్టాప్ కూలింగ్ టెక్నాలజీతో..

Z370 AORUS మదర్‌బోర్డ్స్‌కు అటాచ్ చేసిన స్మార్ట్ ఫ్యాన్ 5 తన ఫ్యాన్ స్టాప్ టెక్నాలజీతో ఫ్యాన్‌లను యాక్టివ్‌గా షట్ ఆఫ్ చేస్తూ యాంబియంట్ నాయిస్‌ను ఎప్పటికప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫ్యాన్‌లోని కూలింగ్ టెక్నాలజీ మదర్‌బోర్డ్‌లోని కాంపోనెంట్‌లను ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంచుతూ అంతరాయంలేని గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

RGB Fusion సపోర్ట్..

RGB Fusion సపోర్ట్..

Z370 AORUS మదర్‌బోర్డులో ఎక్విప్ చేసిన అడ్వాన్సుడ్ ఎల్ఈడి సిస్టంకు RGB Fusion మరింత వన్నెను తీసుకువస్తుంది. ఈ మదర్ బోర్డ్‌లోని టాప్ అలానే బోటమ్ భాగాలు RGB పిన్ హెడర్స్‌ను ఆఫర్ చేస్తాయి.

RGB Fusion యాప్, బోర్డ్‌లోని ఒక్కొ విభాగానికి ఒక్కో రకమైన లైటింగ్ ఆప్షన్‌ను సెట్ చేస్తుంది. దీంతో మోడర్స్ అలానే పీసీ బిల్డర్స్‌కు ఈ బోర్డ్ మరింత కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది.

మదర్‌బోర్డ్ అంటే ఏంటి..?

మనం కంప్యూటర్‌లోని అతిముఖ్యమైన భాగాల్లో మదర్‌బోర్డ్ ఒకటి. సీపీయూ కీలక వ్యవస్థల్లో ఒకటైన మదర్‌బోర్డ్‌ను మెయిన్ బోర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ బోర్డుకు కంప్యూటర్‌లోని అని భాగాలు కొన్ని నేరుగా మరికొన్ని కేబుల్స్ ద్వారా కనెక్ట్ కాబడి ఉంటాయి.

మదర్‌బోర్డులు రకరకాల సామార్థ్యాలతో లభ్యమవుతున్నాయి. పర్సనల్ కంప్యూటర్‌లలో ఉపయోగించే మదర్‌బోర్డులతో పోలిస్తే గేమర్స్ కోసం రూపొందించే మదర్‌బోర్డులు మరింత శక్తివంతమైన కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Gigabyte Technology, a leading manufacturer of motherboards and graphics cards, has unveiled the new Gigabyte Z370 AORUS motherboards.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X