అసలు కధ అక్కడితో ఆరంభం!!

Posted By: Prashanth

అసలు కధ అక్కడితో ఆరంభం!!

 

తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటి తయారీ పై దృష్టి సారిస్తున్నాయి. ఆకాష్‌తో మొదలైన్ ఈ ఒరవడి రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ఈ నేపధ్యంలో భారతీయ సంస్థ గోటెక్ రూ.7,000 ధరలో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. మే 12న, ఫన్ ట్యాబ్ సిరీస్‌లో వీటిని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ఈ టాబ్లట్ పీసీలలో ఒక దాని ధర రూ.5,000లోపు ఉండొచ్చని సమాచారం.

గోటెక్ సంస్థ, ఫన్‌బుక్ సిరీస్ నుంచి ఇదువరుకే రెండు వేరియంట్‌లలో టాబ్లెట్‌లను విడుదల చేసింది. వీటిలో ఒకటి 7 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండగా మరొకటి 10 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ‘యక్రాస్ వరల్డ్ ఎడ్యూకేషన్’తో ఒప్పందం కుదుర్చుకున్న గో‌టెక్ ఆండ్రాయిడ్ టచ్ స్ర్కీన్ టాబ్లెట్‌ను రూపొందించింది. ‘ATab’గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ధర రూ.5,000. ప్రధానంగా ఈ కంప్యూంటింగ్ పరికరాన్ని విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులను ద్ళష్టిలో ఉంచుకుని రూపొందించారు. ధర అంచనా రూ.5,000.

ఆకాష్, యూబీస్లేట్, బీఎస్ఎన్ఎల్, కోబియన్, మైక్రోమ్యాక్స్ వంటి బ్రాండ్లు ఇప్పటికే ఆండ్రాయిడ్ ఆధారిత చవక కంప్యూటర్లను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ తరుణంలో గోటెక్ ఏ మేరకు జనాదరణను పొందగలదో చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot