గూగుల్ ప్రయోగం.. యాపిల్‌కు సంకటం?

Posted By: Prashanth

Google, Asus to Launch a $99 Nexus Tablet at CES 2013

 

గూగుల్ చేపట్టబోయే తాజా ఆవిష్కరణ యాపిల్ ఆధిపత్యానికి గండికొట్టనుందా..?, గూగుల్ బ్రాండెడ్ నెక్సస్ 7 ట్యాబ్లెట్ యాపిల్ ఐప్యాడ్ మీనీకి గట్టిపోటినివ్వనుందా..? తాజాగా బహిర్గతమైన వివరాలు ఈ తరహా పరిస్థితులకు భీజం పోసేవిగా ఉన్నాయి. నిత్యం ఆసక్తికర వార్తలతో సంచలనాలు నమోదు చేసే పికాసా(Picasa)తాజాగా పలు ఫోటోగ్రాఫ్‌లతో కూడిన డాటాను బహిర్గతం చేసింది. ఈ సైట్ వెల్లడించిన వివరాల మేరుకు.... అసూస్ డిజైన్ చేసిన చవక ధర గూగుల్ బ్రాండెడ్ ట్యాబ్లెట్ ‘నెక్సస్ 7’ (ధర అంచనా $99)ను ఈ జనవరిలో నిర్వహించి ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ఆవిష్కరించేందుకు గూగుల్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ప్రళయం తప్పదా..?

అసూస్ నెక్సస్ ట్యాబ్లెట్స్ (అనధికారిక స్సెసిఫికేషన్‌‌లు):

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

1గిగాహెడ్జ్ వండర్ మీడియో ప్రాసెసర్,

400మెగాహెడ్జ్ మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

1జీబి ర్యామ్,

1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

ఐప్యాడ్ మినీకి పోటీ తప్పదా..?

పికాసా వెల్లడించినట్లే గూగుల్ తన చవక ధర నెక్సస్ ట్యాబ్లెట్ ($99 రూ.5,500)ను ‘సీఈఎస్’ వేదికగా మర్కెట్లోకి తెచ్చినట్లయితే యాపిట్ ట్యాబ్లెట్ ఐప్యాడ్ మినీ (రూ.21,900) విక్రయాలు సన్నగిల్లే అవకాశముంది.

ఐప్యాడ్ మినీ స్సెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈగి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై ఇంకా బ్లూటూత్ ఫీచర్లు, 3జీ ఇంకా 4జీ సపోర్ట్, 16.3డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్).

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot