టీవీల్లోకి యూట్యూబ్!

Posted By:

ఇండియా వంటి ప్రధాన దేశాల్లో యూట్యూబ్ వినియోగాన్ని మరింత విస్తరింపచేసే క్రమంలో గూగుల్ దేశంలోని డీటీహెచ్ కేబుల్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థల ప్లాట్‌ఫామ్స్ పార్టనర్‌షిప్స్ గ్లోబల్ సంచాలకులు ఫ్రాన్సిస్కో వరీలా ఒక ప్రకటనలో తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్లలో భారత్‌కు ప్రముఖ స్థానం ఉంది. ఈ కమ్రంలో తమ యూట్యూబ్ సర్వీసులను దేశంలోని గడపగడపకు విస్తరింపజేసేందుకు గూగుల్ సన్నద్ధంగా ఉన్నట్లు వరీలా వెల్లడించారు.

టీవీల్లోకి యూట్యూబ్!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 గూగుల్ యత్నం ఫలించినట్లయితే దేశంలోని ప్రజలు ఇంటర్నెట్ లేకుండానే టీవీల ద్వారా యూట్యూబ్ వీడియోలను తిలకించవచ్చు. ఈ సర్వీసును వీలైనంత త్వరగా అందుబాటులోకి గూగుల్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వరీలా తెలిపారు. గూగుల్ తాజా యూట్యాబ్ కాన్సెప్ట్, దేశంలో స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేని అనేకమంది వినియోగదారులకు వరంలా మారనుంది.

యూట్యూబ్ గురించి పలు ఆసక్తికర నిజాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting