చైనాకు షాకిచ్చిన గూగుల్
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, చైనాలో తమ కార్యకలాపాలను ఆదివారం అర్థరాత్రి నుంచి అర్ధాంతరంగా ఆపివేసింది. హ్యాకర్లు దాడులు పెరిగిపోవడం, పలు నిబంధనలు వ్యాపార లావాదేవిలకు అడ్డుగా మారటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో గూగుల్ తమ కార్యాలయాన్ని చైనా నుంచి హాంకాంగ్‌కు బదిలీ చేసింది. దీంతో గూగుల్ పై చైనా ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

గూగుల్ సెర్చ్ ఇంజన్ పై సెన్సార్ విధించడం, కొన్ని సున్నితమైన శోధనా ఆపరేషన్‌లను ఫిల్టర్ చేయటం తదితర అంశాలు గూగుల్‌కు ఇబ్బందిగా మారటంతోనే గూగుల్ ఈ మేర నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గూగుల్ చైనా కార్యకలాపాలను హాంకాంగ్‌కు బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం యావత్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ పలువురు మద్దతుతారులు బీజింగ్‌లోని గూగుల్ ప్రధాన కార్యాలయం ఎదుట ప్లవర్ బొకేలు, చాక్లెట్ ఇంకా ఇతర బహుమతులతో శాంతియుత నిరసనను తెలియజేసారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications