మరింత అవగాహనతో గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

Posted By:

మరింత అవగాహనతో గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్టులో మరో కీలక మైలురాయిని అధిగిమించినట్లు గూగుల్ వెల్లడించింది. మెరుగుపరచబడిన సాఫ్ట్‌వేర్‌ను ఈ కారులో ఇన్స్‌స్టాల్ చేసి టెస్ట్ రన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు గూగుల్ సోమవారం వెల్లడించింది. కాలీఫోర్నియా, శాన్‌ఫ్రానిస్కో వంటి రద్దీ ప్రదేశాల్లో ఈ డ్రైవర్‌లెస్ కార్లను మరింత సురక్షితంగా పరుగులు తీసినట్లు గూగుల్ వర్గాలు తెలిపాయి.

అంతా గూగల్ ఆశించినట్లే జరిగితే ఈ డ్రైవర్‌లెస్ కార్లు త్వరలోనే రోడ్ల పైకి వచ్చే అవకాశముంది. గూగుల్ డ్రైవర్ రహిత కార్లు అందుబాటులోకి వచ్చినట్లయితే... స్టీరింగ్ పట్టుకోకుండానే రోడ్ల పై  సురక్షితమైన ప్రయాణాన్ని సాగించవచ్చు. ఈ మెరుగుపరచబడిన గూగుల్ సాఫ్ట్‌వేర్.. గూగుల్ మ్యాప్స్, స్ట్రీట్ వ్యు ఆధారంగా గమ్యస్థానానికి సంబంధించిన మార్గాన్ని ఆటో మెటికగా సెట్ చేసుకుంటుంది. ట్రాఫిక్‌కు తగ్గట్లుగా వేగాన్ని మార్చుకుని కారును సురక్షితంగా మందుకు నడిపిస్తుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/dk3oc1Hr62g? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot