ఆన్‌లైన్ షాపర్లకు శుభవార్త: గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ 24 గంటలు పొడిగింపు

Posted By:

భారత్‌లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను గూగుల్ ఇండియా మరో 24గంటల పాటు పొడిగించింది. అంటే ఈ ఆన్‌లైన్ అమ్మకాల ఫెస్టివల్ డిసెంబర్ 14వ తేదీ వరకు కొనసాగనుంది.

గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్, మరో 24 గంటలు పొడిగింపు

ఆన్‌లైన్ షాపర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించటం కారణంగానే షాపింగ్ ఫెస్టివల్‌ సమాయాన్ని  మరో 24 గంటల పాటు పొడిగించినట్లు గూగుల్ ఇండియా పేర్కొంది. గూగుల్ రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా 200లకు పైగా ఇ-కామర్స్ సైట్లు గూగుల్ ఆధ్వర్యంలో తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి.

ఆన్‌లైన్ షాపర్లు ఆయా ఉత్పత్తుల కొనుగోలును బట్టి 20 శాతం నుంచి 80 శాతం రాయితీలను పొందుతారు. గూగుల్ నిర్వహిస్తున్నఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు, ఆన్‌లైన్ ట్రావెట్ సైట్లు, ఆటో, టెలికాం, ఫ్యాషన్ , హెల్త్, బ్యాంకింగ్ ఇంకా ఇతర సర్వీసులు కంపెనీలు తమ ఉత్పత్తుల ఎంపిక పై ఆన్‌లైన్ షాపర్లకు భారీ రాయితీలను అందిస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot