‘గుగూల్ ఫైబర్’..సరికొత్త హైస్పీడ్ ఇంటర్నెట్!

Posted By: Prashanth

‘గుగూల్ ఫైబర్’..సరికొత్త హైస్పీడ్ ఇంటర్నెట్!

 

ఎన్నో ఎదరుచూపుల తరువాత హైస్పీడ్ ఇంటర్నెట్ ‘గుగూల్ ఫైబర్’ను గుగూల్ ప్రకటించింది. యూఎస్ఏలోని కాన్సాస్ పట్టణం, ఈ అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ముందుగా అందుకోనుంది. సెప్టంబర్ నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. గుగూల్ ఫైబర్ 1జీబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్పీడ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లతో పోలిస్తే 100 రెట్టు ఎక్కువ. థిన్ ఆప్టికల్ ఫైబర్ లైన్‌ల ద్వారా ‘గుగూల్ ఫైబర్’ ఇంటర్నెట్ యూజర్‌కు చేరుతుంది. ఈ కనెక్షన్‌ను పొందటం వల్ల వినియోగదారులు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చని గుగూల్ పేర్కొంది. గుగూల్ ఫైబర్ హోమ్ ఇన్స్‌టాలేషన్‌కు సంబంధించి గుగూల్ ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ప్రీ- రిజిస్ట్రేషన్‌కు ఆకరు తేదీ సెప్టంబర్9,2012. నెలవారి చెల్లింపు ఛార్జి $70. గుగూల్ ఈ ఫైబర్ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరి 2010లో ఆరంభించింది.

గుగూల్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టువిటీ వీడియో:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot