‘టెక్నాలజీ అద్భుతం’.. మిస్ కావద్దు!!

Posted By: Prashanth

‘టెక్నాలజీ అద్భుతం’.. మిస్ కావద్దు!!

 

అవును ఇది నిజంగా అద్భుతమే.. ఇంటర్‌నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రానిక్ కళ్లద్దాలను రూపొందించింది. వివిధ పరిసరాల్లోని ద్ళశ్యాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ స్ర్కీన్ పై చూసిన అనుభూతిని ఈ మేజోడు కలిగిస్తుంది. ఆండ్రాయిడ్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ గ్లాస్‌లు పరిసరాల్లోని సమాచారాన్ని నేరుగా కంటిలోకి ప్రవహింపజేస్తాయి.

దీంతో వీటిని ధరించినవారికి కంప్యూటర్ మానిటర్ ద్వారా చూస్తున్నట్లుగానే అనుభూతి కలుగుతుంది. జీపీఎస్ పరిజ్ఞానం, అనేక సెన్సర్ల ద్వారా సమాచారాన్ని సేకరించే ఈ కళ్లజోడు 3జీ లేదా 4జీ కనెక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే గూగుల్ లాటిట్యూడ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ గాగుల్స్ వంటి అప్లికేషన్లన్నీ ఈ కళ్లజోడులో కూడా ఉంటాయి. ఈ కళ్లద్దాలు ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot