సామ్‌సంగ్, ఎల్‌జి స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన గూగుల్

|
ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్‌తో సామ్‌సంగ్, ఎల్‌జి స్మార్ట్‌వాచ్‌లు

తన సరికొత్త గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై రూపకల్పన చేయబడిన సామ్‌సంగ్ గేర్ లైవ్, ఎల్‌జి జి స్మార్ట్‌వాచ్‌లను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన గూగుల్ ఐ/ఓ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ (Google I/O developer conference) కీలక ప్రసంగంలో భాగంగా ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లకు సంబంధించిన విక్రయాలు వివరాలను గూగుల్ తన ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

 

మరో ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్ మోటరోలా మోటో360ని త్వరలో విడుదల చేస్తామని గూగుల్ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్ యూజర్లు ఎల్‌జి జి స్మార్ట్‌వాచ్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ధర రూ.14,999. మరో స్మార్ట్‌వాచ్ సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ లైవ్ ఇండియన్ మార్కెట్ ధర రూ.15,900గా గూగుల్ ప్లేస్టోర్‌లో పేర్కొనటం జరిగింది. మార్కెట్లో ఈ వాచ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్‌తో సామ్‌సంగ్, ఎల్‌జి స్మార్ట్‌వాచ్‌లు
ఎల్‌జి జి స్మార్ట్‌వాచ్ కీలక స్పెసిఫికేషన్‌‍‌‍లు:

1.65 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 280 x 280పిక్సల్స్), గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్, 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ కనెక్టువిటీ, యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, గైరో స్కాపో, వాటర్ ఇంకా డస్ట్ రెస్టిస్టెంట్, స్మార్ట్‌వాచ్ పరిమాణం 37.9 x 46.5 x 9.95మిల్లీమీటర్లు. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్‌తో సామ్‌సంగ్, ఎల్‌జి స్మార్ట్‌వాచ్‌లు

సామ్‌సంగ్ గేర్ లైవ్ స్మార్ట్‌వాచ్ కీలక స్పెసిఫికేషన్‌లు:

1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్),
గూగుల్ ఆండ్రాయిడ్ వేర్‌ప్లాట్ ఫామ్,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
4.జీబి ఇంటర్నల్ మెమెరీ,
బ్లూటూత్ 4.0 ఎల్ఈ కనెక్టువిటీ,
యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, హార్ట్ రేట్ మానిటర్,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X