డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్...ప్రభుత్వంతో గూగుల్ భాగస్వామ్యం

Posted By:

దేశాన్ని డిజిటల్ ఆధారిత విజ్ఞాన రంగంగా మార్చేందుకు ‘డిజిటల్ ఇండియా' పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి గూగుల్ ఇండియా సహకారాన్ని అందించనున్నట్లు గూగుల్ ఇండియా డివిజన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ ఓ ప్రముఖ పత్రికకు వెల్లడించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇంటర్నట్ వ్యవస్థను గూగుల్ మరింత బలోపేతం చేయనుంది.

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్...ప్రభుత్వంతో గూగుల్ భాగస్వామ్యం

నరేంద్ర మెడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా పథకం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ప్రయ్నతం చేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టువిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ఈ ప్రథకం ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వాలంటే దేశంలోని మారుమూల పల్లెలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఎంతో అవసరం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google India: Partnering with Modi government to accelerate Digital India programme. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot