హాంఫట్.. ఊహించిందే జరిగింది!

Posted By: Prashanth

హాంఫట్.. ఊహించిందే జరిగింది!

ఆది నుంచి ఊహించిందే జరిగింది.. బుధవారం నుంచి ప్రారంభమైన గుగూల్ ఐ/వో 2012 సమావేశాల్లో సెర్చ్ ఇంజన్ గుగూల్ నెక్సస్ 7 టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. హై ఎండ్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ 8జీ వర్షన్ ధర రూ.11,000 ($199). గుగూల్, అసస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆపిల్ కొత్త ఐప్యాడ్ అదేవిధంగా ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీలతో పోటీ పడనుంది.

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా వస్తున్న తొలి డివైజ్ గుగూల్ నెక్సస్ 7, టాబ్లెట్ ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన 7 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ద్యం 1280 x 800పిక్సల్స్. 1.2గిగాహెట్జ్ సామర్ద్యం గల క్వాడ్ కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్‌ను వినియోగించారు. 1జీబి ర్యామ్ సమర్థవంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. రెండు మెమరీ వర్షన్‌లలో గుగూల్ నెక్సస్ 7 లభ్యం కానుంది. 8జీబి వర్షన్ ధర $199.16జీబి వర్షన్ ధర $249.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, బ్రిటన్ దేశాలకు చెందిన వినియోగదారులు ఈ టాబ్లెట్‌ను గుగూల్ ప్లే స్టోర్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. జూలై 15నాటికి డెలివరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారత్‌లో నెక్సస్ 7 టాబ్లెట్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot