నవంబర్‌లో గూగుల్ కొత్త ట్యాబ్లెట్

Posted By:

సెర్జ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఇండియన్ మార్కెట్లో తన రెండవ జనరేషన్ ‘నెక్సూస్ 7' ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను నవంబర్‌లో విడుదల చేయనుంది. నెక్సూస్ 7 ట్యాబ్లెట్‌ను గూగుల్, అసూస్ భాగస్వామ్యంతో రూపొందించింది. ఇండియన్ మార్కెట్లో నెక్సూస్ 7 ట్యాబ్లెట్ పీసీలను నోయిడా ఇంకా బెంగుళూరు ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ ల్యాండ్ రిటైల్ స్టోర్‌లలో విక్రయించనున్నారు. నెక్సూస్ 7 ప్రస్తుత వర్షన్‌ను ఇండియాన మార్కెట్లో ప్రత్యేక ధర తగ్గింపు పై విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ మార్కెట్లో నెక్సూస్ 7 (16జీబి -వైఫై వర్షన్) ను రూ.9,999కి విక్రయిస్తున్నారు. నెక్సూస్ 7 (32జీబి -వైఫై వర్షన్) ను రూ.13,499కి విక్రియిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నవంబర్‌లో గూగుల్ కొత్త ట్యాబ్లెట్

నెక్సూస్ 7 (రెండవ తరం) ట్యాబ్లెట్‌లోని ప్రధాన ఫీచర్లు:

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x 1200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్,
3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot