ఫుట్‌బాల్ స్టేడియమ్‌లను లోతుగా వీక్షించేందుకు గూగుల్ మ్యాప్స్

Posted By:

2014 ఫీఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మరో వారం రోజుల్లో బ్రెజిల్ వేదికగా ప్రారంభంకానున్నాయి. ఆ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారి కోసం గూగుల్ మ్యాప్స్ ఓ అనుసంధానకర్తతో ముందుకొచ్చంది. వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోయే 12 స్టేడియమ్‌లకు సంబంధించి లోతైన విశ్లేషణలను అందిస్తూ గూగుల్ మ్యాప్స్ ప్రత్యేకమైన స్ట్రీట్‌వ్యూ ఫీచర్‌ను ఆవిష్కరించింది.

 ఫుట్‌బాల్ స్టేడియమ్‌లను లోతుగా వీక్షించేందుకు గూగుల్ మ్యాప్స్

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని స్టేడియమ్ అంతర్గత భాగాలను సైతం పూర్తి స్థాయిలో వీక్షించవచ్చు . మ్యాచ్‌లు జరిగే 12 స్టేడియమ్‌లలో 6 స్టేడియమ్‌లు పూర్తి స్థాయి కనెక్టువిటీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉన్నాయని వాషింగ్‌టన్ పోస్ట్ వెల్లడించింది. కాబట్టి మీ మొబైల్ ఇంటర్నెట్‌ను తక్షణమే యాక్టివేట్ చేసుకుని మీ ఫేవరెట్ ఫుట్‌బాల్ స్టేడియమ్‌లకు సంబంధించిన పూర్తి సమచారం తెలుసుకోండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot