మరో నిజం.. ఆ ఇద్దరే టార్గెట్?

Posted By: Prashanth

మరో నిజం.. ఆ ఇద్దరే టార్గెట్?

 

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారిత నెక్సస్ 7 టాబ్లెట్‌ను ప్రకటించి మంచి హుషారుమీదున్న సెర్చ్‌ఇంజన్ గెయింట్ గుగూల్ భవిష్యత ప్రణాళికలో భాగంగా మరో ఆవిష్కరణకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెక్సస్ 7 టాబ్లెట్‌ను విడుదల చేసిన వెనువెంటనే నెక్సస్ 10 టాబ్లెట్‌ను తెరపైకి తెచ్చేందుకు గుగూల్ కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నెక్సస్ 10 టాబ్లెట్ పీసీకి సంబంధించి ఇప్పటికే పలు స్పెసిఫికేషన్‌లు వెబ్‌ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

నెక్సస్ 10 కీలక ఫీచర్లు:

10 అంగుళాల టచ్‌స్ర్కీన్,

ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఇన్‌బుల్ట్ మెమరీ ఆప్షన్స్ 16జీబి, 32జీబి.

ఆపిల్.. ఆమోజన్‌లకు ‘గుగూల్ గండం’..

ప్రముఖ సెర్చ్ఇంజన్ గుగూల్ పది రోజుల క్రితం జరగిన గుగూల్ ఐవో వార్షిక సదస్సులో నెక్సస్ 7 టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. అసస్‌చే డిజైన్ చెయ్యబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. గుగూల్ తాజా ఆవిష్కరణ, ఆపిల్ ఐప్యాడ్‌తో పాటు ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్‌లకు కొత్త సవాల్‌ను విసిరనట్లయ్యింది. ఈ మూడు గ్యాడ్జెట్ల ప్రధాన ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం…

గగూల్ నెక్సస్ 7:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెట్జ్ టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బరువు 0.75 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (9.5గంటలు),

ధరలు 8జీబి వర్షన్ – 11,000, 16జీబి వర్షన్- 14,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot