మార్కెట్లోకి గూగుల్ నెక్సస్ 7 న్యూ వర్షన్ టాబ్లెట్

|

అసుస్ - గూగుల్ సంయుక్తంగా రూపొందించిన 2013 ఎడిషన్ నెక్సస్ 7 టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో అసుస్, గూగుల్ సంస్థలు అధికారికంగా విడుదల చేసాయి. ఇండియన్ యూజర్ల కోసం ఈ టాబ్లెట్ ను వై-ఫై ఇంకా 4జీ ఎల్టీఈ వేరియంట్ లలో అందుబాటులో ఉంచారు. వై-ఫై వేరియంట్ 16జీబి వేరియంట్ ధర రూ.20,999. వై-ఫై రకం 32జీబి మెమరీ వర్షన్ ధర రూ.23,999. 4జీ ఎల్టీఈ వర్షన్ 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.27,999. ఈ టాబ్లెట్ కొనుగోలు పై సంవత్సరం పాటు అంతర్జాతీయ వారంటీ లభిస్తుంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లోకి గూగుల్ నెక్సస్ 7 న్యూ వర్షన్ టాబ్లెట్

2013 ఎడిషన్ నెక్సస్ 7 టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్),
10 ఫింగర్ మల్టీ టచ్ ఫీచర్, 323 పీపీఐ,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 ప్రో (ఏపీక్యూ8064-1ఏఏ, క్రెయిట్ 300 కోర్స్) ప్రాసెసర్,
క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, 3జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్ లెస్ ఛార్జింగ్, జీపీఎస్ సపోర్ట్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, హెచ్ డిఎమ్ఐ అవుట్ పుట్,
నాన్-రిమూవబుల్ లియోన్ 3950ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల హైడెఫినిషన వీడియ ప్లేబ్యాక్, 10 గంటల వెబ్ బ్రౌజింగ్ లేదా ఇ-రీడింగ్ చేసుకోవచ్చు),
డ్యూయల్ స్టీరియో సోనిక్ మాస్టర్ స్పీకర్స్,
వైర్‌లెస్ ఛార్జింగ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X