అక్టోబర్‌లో రికార్డులు బ్రేక్ చేసేందుకు?

Posted By: Staff

అక్టోబర్‌లో రికార్డులు బ్రేక్ చేసేందుకు?

దిగ్గజ సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్’ సపోర్ట్‌తో పనిచేసే నెక్సస్ 7 టాబ్లెట్‌ను గత జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అసస్‌చే డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను సులువుగా రిపేర్ చేసుకోవచ్చంటూ ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ ఐఫిక్స్‌ఇట్ (iFixit) అదిరిపోయే రేటింగ్‌ను విడుదల చేసింది. వై-ఫై వర్షన్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ టాబ్లెట్ త్వరలో 3జీ వర్షన్‌లో లభ్యంకానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం అసస్.. 3జీవర్షన్ నెక్సస్7 టాబ్లెట్ రూపకల్పన పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ 3జీ వర్షన్ నెక్సస్ 7 అక్టోబర్ మధ్య నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశముందని ప్రముఖ టెక్ బ్లాగర్ పాల్ ఓబ్రియన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. 3జీ వర్షన్ టాబ్లెట్ హార్డ్‌వేర్ రూపకల్పనకు సంబంధించి అసస్ వై-ఫై వర్షన్ విధానాలనే అనుసరించి ఉండొచ్చని ఓబ్రియిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి టెక్ నిపుణుల స్పందన వేరొకలా ఉంది. రాబోయే 3జీ వర్షన్ నెక్సస్ 7 వై-ఫై వర్షన్‌లో లోపించిన రేర్ కెమెరా అదేవిధంగా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మొబైల్ సిమ్ స్లాట్ వ్యవస్థలను కలిగి ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

గూగుల్ నెక్సస్ 7 ఫీచర్లు:

గగూల్ నెక్సస్ 7:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెట్జ్ టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బరువు 0.75 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (9.5గంటలు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot