వచ్చేసిందోచ్...!

Posted By: Staff

వచ్చేసిందోచ్...!

గ్యాడ్జెట్ ప్రియులను గత కొంత కాలంగా ఊరిస్తున్న గూగుల్ నెక్సస్ 7 టాబ్లెట్ పీసీ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఈ టాబ్లెట్ అమ్మకాలను ప్రారంభించాయి. 8జిబి సామర్థ్యంతో కూడిన గూగుల్ నెక్సస్ 7 ధర దాదాపు 17,000 రూపాయలుగా ఉంది. ఈ టాబ్లెట్‌ను సొంతం చేసుకోవాలని చాలా మంది గ్యాడ్జెట్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.3 గిగా హెట్జ్ టెగ్రా3, సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లిబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో డివైజ్ పని చేస్తుంది. ఏర్పాటు చేసిన 1.2 మెగా పిక్సెల్ కెమెరా సౌలభ్యతతో ఫొటోలు తీసుకోవచ్చు, వీడియా కాల్స్ నిర్వహించుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting