గాలి వార్త... బలపడుతున్న అనుమానాలు!

Posted By: Staff

 గాలి వార్త... బలపడుతున్న అనుమానాలు!

గుగూల్, అసస్‌లు సంయుక్త ఆధ్వర్యంలో డిజైన్ చేసిన టాబ్లెట్ కంప్యూటర్ ‘నెక్సస్ 7’ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ గ్యాడ్జెట్ ఆవిష్కరణకు సంబంధించి అధికారికంగా సమాచారం లేదు. అయితే, నేటి నుంచి ప్రారంభంకానున్న గుగూల్ ఐ/వో సమావేశాల్లో నెక్సస్ 7 ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపధ్యంలో డివైజ్ స్పెసిఫికేషన్‌ల పై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అనధికార వర్గాల సమాచారం మేరకు నెక్సస్ 7 ఫీచర్లు:

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఇన్‌బుల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్ 8 GB/16 GB,

ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

9 గంటల బ్యాటరీ బ్యాకప్,

ధర అంచనా రూ.11,000.

వ్యక్తమవుతున్న రూమర్ల పట్ల అసస్, గుగూల్ వర్గాలు ఏమాత్రం స్పందించకపోవటంతో అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూమర్లే నిజం కావాలని వారు కోరుకుంటున్నారు. పైన పేర్కొన్న ఫీచర్ల ఆధారంగా డివైజ్ పనితీరును అంచానా వేస్తే... వినియోగించిన ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్ 1.3గిగాహెట్జ్ క్లాక్ సామర్ధ్యాన్ని కలిగి టాబ్లెట్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత బలపరుస్తుంది. 7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే 1280 * 800 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉత్తమ క్వాలిటీ విజువల్ అనుభుతులను చేరువ చేస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం అనేకమైన ఆధునిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తూ యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటంగ్‌ను అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot