గూగల్ నెక్సస్ 7 x ఆపిల్ ఐప్యాడ్ మినీ

Posted By: Super

 గూగల్ నెక్సస్ 7  x ఆపిల్ ఐప్యాడ్ మినీ

 

టాబ్లెట్ పీసీల విభాగంలో అగ్రగామిగా నిలిచిన టెక్ టైటాన్ ఆపిల్‌కు పోటీకి గూగుల్ సమాయుత్తమైంది. గూగుల్ గత జూన్‌లో ఆవిష్కరించిన టాబ్లెట్ నెక్సస్ 7 ఇటీవల విడుదలైన ఐప్యాడ్ మినీతో తలపడనుంది.  ఈ కంప్యూటింగ్ డివైజులకు ఇండియన్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దేశీయంగా ‘ఐప్యాడ్ మినీ’కి సంబంధించి పలు ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు ఇప్పటికే ప్రీఆర్డర్‌లను స్వీకరిస్తున్నాయి. ధర రూ.25,900. మరో వైపు ‘నెక్సస్ 7’ను క్రోమా రిటైల్ స్టోర్ నేటి నుంచి విక్రయించనుంది. ధర రూ.19,981. ఈ నేపధ్యంలో ఇరు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్టుకొలత.....

గూగుల్ నెక్సస్ 7:  198.5 x 120 x 10.45మిల్లీ మీటర్లు, బరువు 340 గ్రాములు,

ఆపిల్ ఐప్యాడ్ మినీ:  200 x 134.7 x 7.2మిల్లీ మీటర్లు,  బరువు 308 గ్రాములు,

డిస్‌ప్లే.....

గూగుల్ నెక్సస్ 7: 7 అంగుళాల WXGA 10 పాయింట్ మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే,

ప్రాసెసర్.....

గూగుల్ నెక్సస్ 7: 1.2గిగాహెడ్జ్  క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఐ5 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

గూగుల్ నెక్సస్ 7: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.2 అప్ గ్రేడబుల్) ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, మెరుగుపరచబడిన  ఆండ్రాయిడ్ బీమ్,  ఆన్-స్ర్కీన్ నేవిగేషన్, రీసైజబుల్ అప్లికేషన్స్,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ప్రత్యేకతలు: ఆపిల్ మ్యాప్స్‌తో కలిపి 200 కొత్త ఫీచర్లు,  మెరుగుపరచబడిన సిరీ అప్లికేషన్, సరికొత్త  సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫోటోస్ట్రీమ్ అప్లికేషన్,  పాస్‌బుక్ అప్లికేషన్, లోతైన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ ఇంటిగ్రేషన్,

కెమెరా.....

గూగుల్ నెక్సస్ 7: 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఆపిల్ ఐప్యాడ్ మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇతర ప్రత్యేకతలు: ఇల్యూమినేషన్,  హెచ్‌డిఆర్,  పానోరమా సపోర్ట్, వేగవంతమైన ఆపెర్చర్ స్పీడ్.

స్టోరేజ్....

గూగుల్ నెక్సస్ 7: ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి/32జీబి),  1జీబి ర్యామ్,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 16GB/32GB/64జీబి, 512ఎంబి ర్యామ్,

కనెక్టువిటీ.....

గూగుల్ నెక్సస్ 7: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,  బ్లూటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ 2.0, (3జీ వర్షన్ గూగుల్ నెక్సస్ 7 త్వరలో అందుబాటులోకి రానుంది),

ఆపిల్ ఐప్యాడ్ మినీ:  లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 3జీ ఇంకా 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే కొత్త వర్సన్ ఐప్యాడ్ మీని నవంబర్ చివరి నాటికి అందుబాటులోకి రానుంది.

బ్యాటరీ......

గూగుల్ నెక్సస్ 7: 4325ఎమ్ఏహెచ్ 16Whr లిపో బ్యాటరీ (9.5 గంటల బ్యాకప్),

ఆపిల్ ఐప్యాడ్ మినీ: 16.3 16Whr లిపో బ్యాటరీ (బ్యాకప్ 10 గంటలు),

ధర.......

గూగుల్ నెక్సస్ 7: రూ.19,891,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: ధర అంచనా రూ.25,000 నుంచి రూ.33,000 మధ్య,

ప్రత్యేకతలు:

గూగుల్ నెక్సస్ 7: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ స్పెసిఫికేషన్స్,  వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ,

ఆపిల్ ఐప్యాడ్ మినీ: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, పెద్దదైన డిస్‌ప్లే, ఐసైట్ టెక్నాలజీతో కూడిన ఉత్తమ క్వాలిటీ కెమెరా, లైట్నింగ్ కనెక్టర్, వివిధ వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot