తేల్చుకోండి: ధర ముఖ్యమా?, క్వాలిటీ ముఖ్యమా?

Posted By: Staff

తేల్చుకోండి: ధర ముఖ్యమా?, క్వాలిటీ ముఖ్యమా?

 

టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో తయారీ సంస్థల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, కార్బన్, మెర్క్యురీ, వైకిడ్‌లీక్‌లు పోటాపోటీగా టాబ్లెట్‌లను ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా గూగుల్ బ్రాండెడ్ టాబ్లెట్ నెక్సస్7 అందుబాటులోకి రావటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇండియన్ మార్కెట్లో ‘గూగుల్ నెక్సస్ 7’ ధర రూ.19,999. నెక్సస్ 7 తరహా స్సెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ ‘మెర్క్యురీ ఎంట్యాబ్ 7’ను కోబియన్ ఇటీవల ఆవిష్కరించింది. మార్కెట్ ధర రూ. 6,499. వీటి ఎంపిక పై అవగాహన కలిగించే క్రమంలో రెండు టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....

బరువు ఇంకా చుట్టుకొలత.....

గూగుల్ నెక్సస్ 7: బరువు 340 గ్రాములు, చుట్టుకొలత 198.5 x 120 x 10.5మిల్లీ మీటర్లు,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: బరువు 400 గ్రాములు, చుట్టుకొలత 193 x 117 x 14మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే......

గూగుల్ నెక్సస్ 7: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

గూగుల్ నెక్సస్ 7: 1.3గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: 1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.......

గూగుల్ నెక్సస్ 7: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ 4.2 జెల్లీబీన్),

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.......

గూగుల్ నెక్సస్ 7: 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్......

గూగుల్ నెక్సస్ 7: ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి, 1జీబి ర్యామ్,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

గూగుల్ నెక్సస్ 7: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-పై, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ వర్షన్,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ వయా డాంగిల్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ......

గూగుల్ నెక్సస్ 7: 4325ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (300 గంటల స్టాండ్‌బై),

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: బ్యాకప్ 5 నుంచి 6 గంటలు,

ధరలు.......

గూగుల్ నెక్సస్ 7: రూ. 19,999,

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్: రూ.6,499.

తీర్పు......

హైడెఫినిషన్ డిస్‌ప్లే, మల్టీకోర్ ప్రాసెసర్, జెల్లీబీన్ యూజర్ వోఎస్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ వంటి ఆధునిక స్సెసిఫికేషన్‌లను కోరుకునే వారికి గూగుల్ నెక్సస్ 7 ఉత్తమ ఎంపిక. ధర గురించి ఆలోచించే కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్ బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot