ఆ టాప్ హిరోల్లో ఎవరిని ఇష్టపడతారు..?

Posted By: Super

ఆ టాప్ హిరోల్లో ఎవరిని ఇష్టపడతారు..?

ఆండ్రాయిడ్ రూపకర్త గూగుల్ సరికొత్త నెక్సస్ 7 టాబ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అసస్‌చే రూపొందించిబడిన ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 డాట్‌కామ్ వారు రూ.15,884కు ఆఫర్ చేస్తున్నారు. ఐబీఎన్ బహిర్గతం చేసిన నివేదికల ప్రకారం నెక్సస్ టాబ్లెట్‌ను ఆన్‌లైన్ ద్వారా రూ.17,884కు విక్రయించాల్సి ఉంది. అయితే, ప్రత్యేక రాయితీల నేపధ్యంలో టాబ్లెట్‌ను రూ.15,884కే అందిస్తున్నారు. 7 అంగుళాల టాబ్లెట్ పీసీల మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిన గుగూల్ నెక్సస్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 310 నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎదుర్కోవల్సి ఉంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్‌ను మేలో విడుదల చేశారు. ధర రూ. 23,250. ఈ నేపధ్యంలో మీ ఓటు ఏ గ్యాడ్జెట్‌కు వేస్తారు..?

చుట్టుకొలతలు:

గెలాక్సీ టాబ్‌తో పోలిస్తే నెక్సస్ 7 స్వల్పంగా మందపు శరీరతత్వాన్ని కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 344గ్రాముల బరువుతో 193.7 x 122.4 x 10.5mmచుట్టుకొలతలను కలిగి ఉండగా, నెక్సస్ 7 340 గ్రాముల బరువుతో 198.5 x 120 x 10.45mm చుట్టుకొలతను ఏర్పాటు చేసుకుంది.

డిస్‌ప్లే:

నెక్సస్ 7, స్ర్కాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గ్లాస్‌తో కూడిన 7 అంగుళాల బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 800పిక్సల్స్. సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్‌టీ WSVGA డిస్‌ప్లేతో డిజైన్ కాబడింది (రిసల్యూషన్ సామర్ధ్యం 1024 X 600పిక్సల్స్).

ఆపరేటింగ్ సిస్టం:

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. గుగూల్ నెక్సస్ 7 ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంతో పోలిస్తే జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం మెరుగైన పనీరును ప్రదర్శిస్తుంది. ఈ వోఎస్ సౌలభ్యతతో కొత్త కొత్త ఫీచర్లను యూజర్ ఆస్వాదించవచ్చు.

ప్రాసెసర్:

గుగూల్ నెక్సస్ 7 ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్ అదేవిధంగా 12 కోర్ గ్రాఫిక్స్ చిప్‌ను కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 2 310, 1 గిగాహెట్జ్ సామర్ధ్యం కలిగిన టీఐ ఓఎమ్ఏపీ డ్యూయల్ కోర్

ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా :

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్‌కు సహకరించే ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరాను కలిగి ఉంది. జియో టాగింగ్, స్మైల్ డిటెక్షన్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఒదిగి ఉన్నాయి. వీడియోలను 720 పిక్సల్ రిసల్యూషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ వేగం 30. గుగూల్ నెక్సస్ 7 కేవలం 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వీడియోలను 720 పిక్సల్ రిసల్యూషన్‌తో రికార్డ్ చేసకోవచ్చు.

స్టోరేజ్:

నెక్సస్ 7 8జీబి,16జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో 8జీబి వర్షన్‌ను మాత్రమే విక్రయిస్తున్నారు. గెలాక్సీ టాబ్ 2 310 16జీబి మెమరీ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. నెక్సస్ 7లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ లోపించింది.

బ్యాటరీ:

నెక్సస్7లో అమర్చిన నాన్-రిమూవబుల్ 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ 8 గంటల వీడియో ప్లేబ్యాక్‌తో పాటు 300గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 2 310లో అమర్చిన నాన్-రిమూవబుల్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 7 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదు.

కనెక్టువిటీ ఆప్షన్లు:

నెక్సస్ 7:

నాన్-3జీ,

వై-ఫై 802.11 a/b/g/n,

బ్లూటూత్,

ఎన్ఎఫ్‌సీ ఫంక్షన్,

ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసిన గుగూల్ వాలెట్,

3.5ఎమ్ఎమ్ హెడ్‌సెట్ జాక్.

గెలాక్సీ టాబ్2 310:

వై-పై 802.11 a/b/g/n,

డీఎల్ఎన్ఏ,

వై-ఫై డైరెక్ట్,

వై-ఫై హాట్‌స్పాట్,

డ్యూయల్ బ్యాండ్,

బ్లూటూత్ వీ3.0 వర్షన్,

3జీ కనెక్టువిటీ (డేటా స్పీడ్ HSDPA 21Mbps and HSUPA 5.76Mbps).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot