మరో ఆరు నెలల్లో గుగూల్..?

Posted By: Prashanth

మరో ఆరు నెలల్లో గుగూల్..?

 

గుగూల్ ప్రపంచానికి ఆరు నెలలు ఎదురుచూపు తప్పదా..?, అభిమానుల కళ్లు కాయలు కాస్తున్నాయా..?, ఆ శుభ గడియకు ముహూర్తం ఖరారయ్యేదెప్పుడు..?

ఎట్టకేలకు ఆండ్రాయిడ్ ఆధారిత ‘గుగూల్ నెక్సస్’ టాబ్లెట్ పీసీ విడుదలకు ముహుర్తం ఖారారయ్యింది. దింతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. విడుదలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికి వెయిట్ చేస్తామంటూ గుగూల్ ఫ్యాన్స్ హుషారు కనబరుస్తున్నారు. గుగూల్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ వోఎస్ పై ఈ టాబ్లెట్ పీసీ రన్ అవుతుంది. బటన్ వ్యవస్థ లేకుండా పూర్తి స్ధాయి స్వైప్ విధానంతో పీసీ పనిచేసే విధంగా డిజైన్ చేసున్నారు.

మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఆపరేటింగ్ సిస్టం ఉత్తమ పనితీరు కనబరుస్తుందని విశ్లేషక వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. పటిష్టమైన క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. గుగూల్ నెక్సస్ టాబ్లెట్ పీసీల కోసం ఎదరుచూసే వారు ఇంకో ఆరు నెలలు ఓపిక పట్టాల్సిందే. ఈ గ్యాడ్జెట్ ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot