అంచనాలు తారుమారు?

By Super
|

అంచనాలు తారుమారు?

 

ప్రపంచ వ్యాప్తంగా వాడి వేడి ఉత్కంఠ రేపుతున్న గుగూల్ నెక్సస్ టాబ్టెట్ పై ఇప్పటి వరకు నెలకున్న అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసస్‌చే రూపొందించబడిన ఈ డివైజ్ జూన్‌లో విడుదలకు ముస్తాబవుతున్న నేపధ్యంలో ఓ రూమర్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుగూల్ నెక్సస్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 5.0 జెల్లీబీన్‌తో రానుందన్న సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ఈ నేపధ్యంలో, జూన్ 27న గుగూల్ నిర్వహించే కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వేదిక పై గుగూల్ నెక్సస్ మరిన్ని హార్డ్‌వేర్ స్పెషిఫికేషన్‌లు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

రూ.10,000లోపు ధరతో విడుదల కాబోతున్న గుగూల్ నెక్సస్ టాబ్లెట్ అనుకున్నట్టుగానే ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైతే మార్కెట్ డిమాండ్ అనూహ్య రీతిలో పెరిగే అవకాశముంది. టాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం రోజు రోజుకు విస్తృతమవుతున్న నేపధ్యంలో వీటి కొనుగోళ్ల పై ఆసక్తిని కనబర్చే వారు ప్రధానంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X