సీన్‌లోకి పెద్దన్న..?

Posted By: Staff

సీన్‌లోకి పెద్దన్న..?

 

ఆండ్రాయిడ్ ఆధారిత చవక టాబ్లెట్ కంప్యూటర్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతున్న నేపధ్యంలో వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా గుగూల్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ అంశం పై సంస్థ సీఈవో లారీ పేజ్ స్పందిస్తూ తక్కువ ధరతో విడుదలైన ఆండ్రాయిడ్ పీసీలకు మార్కెట్లో అనూహ్య రీతిలో ఆదరణ లభించటం శుభపరిణామమని, వీటి విస్తరణకు మరింత దృష్టిసారించాల్సి ఉందని వాపోయారు.

ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్లో చవక ధర ఆండ్రాయిడ్ టాబ్లెట్లను అనేక బ్రాండ్లు విక్రయిస్తున్నాయి. వీటిలో ఐబెర్రీ ఆక్సస్, ఆకాష్, ఇమాటిక్ ఇగ్లైడ్ ప్రిస్మ్, మెర్క్యురీ ఎమ్ ట్యాబ్ నియో 2, బీఎస్ఎన్ఎల్, వెస్‌ప్రో వంటి బ్రాండ్లు ప్రజలను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

ఈ విశ్లేషణలను పరిగణంలోకి తీసుకున్న గుగూల్, నేరుగా తానే రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ పీసీని రూ.10,000కన్నా తక్కువ ధరకే అందించేందుకు ఈ టెక్ జెయింట్ కసరత్తులు పూర్తి చేస్తుంది. ఈ పీసీలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

గుగూల్ ప్రవేశపెట్టబోతున్న టాబ్లెట్ పీసీ ఫీచర్లు (అంచనా):

7 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

వై-ఫై సపోర్ట్,

ఇంటర్నెట్ యాక్సిస్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting