గూడాఛారి విప్పిన గుట్టులో ఏముంది..?

సొంత బ్రాండెడ్ హార్డ్‌వేర్ వ్యవస్థతో స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేసి ఈ విభాగంలో తన సత్తాను చాటుకున్న గుగూల్, టాబ్లెట్ కంప్యూటర్‌ల సెక్టార్ లోనూ పైచేయి సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. అసస్‌తో జత కట్టి ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన టాబ్లెట్ కంప్యూటర్‌ను గుగూల్ ఇటీవల రూపొందించింది. ఈ డివైజ్ మార్కెట్ విడుదలకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూలై 2012 నుంచి గుగూల్ టాబ్టెట్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయని ప్రముఖంగా వార్తలు వినబడుతున్నాయి.
తొలత ఈ టాబ్లెట్‌ను మేలో అందుబాటులోకి తేవాలని గుగూల్ నిశ్చయించుకుంది. పలు సాంకేతిక లోపాల కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. అసస్ డిజైన్ చేసిన గుగూల్ నెక్సస్ టాబ్లెట్ ధర అంచనా రూ. 13,000 . డివైజ్ ప్రధాన ఫీచర్లను పరిగణలోకి తీసుకుంటే...
* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,
* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
* టెగ్రా 3 ప్రాసెసర్,
* వై-ఫై కనెక్టువిటీ,
రెండు బలమైన కంపెనీల సమన్వయంతో రూపుదిద్దుకుంటున్న ఈ హై ఎండ్ కంప్యూటింగ్ డివైజ్ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఇప్పటికే పలు దేశాల కంప్యూటింగ్ మార్కెట్లలో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీకి, గుగూల్ నెక్సస్ పోటీగా నిలవనుందని పరిశీలకల అంచనా. సామన్య, మధ్య తరగతి వినియోగదారులకు సైతం ఈ టాబ్లెట్‌ను అందుబాటులో ఉంచేందకు తక్కువ ధరకే వీటిని విక్రయించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచరం.


Click it and Unblock the Notifications