‘గూగుల్’ పై గుప్పుమంటున్న వదంతులు..?

By Super
|
Google


డిజిటల్ ప్రపంచానికి ఎంతగానో తోడ్పడుతున్న ‘గూగుల్’(Google) సరికొత్త ఆవిష్కరణకు వ్యూహరచన చేస్తుంది. సరికొత్త ‘ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం’ ఆధారిత టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘నెక్సెస్ ట్యాబ్’ వర్షన్లో ఈ టాబ్లెట్ విడుదలవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

శక్తివంతమైన క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా2 ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ ట్యాబ్లెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అంతిమంగా ఈ టాబ్లెట్ హై క్వాలిటీ పనితీరును ప్రదర్శిస్తుందని అంచనాలు ఊపందుకున్నాయి.

అయితే ఈ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించి ‘గూగుల్’ ఎటువంటి అధికారిక ప్రకటనను వెలువరించలేదు. గూగుల్ అప్‌లోడ్ చేసిన ఓ టాబ్లెట్ పీసీ ఇమేజ్ ఆధారితంగా ఈ రూమర్ గుప్పుముంటోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X