గూగుల్ vs సామ్‌సంగ్!

By Prashanth
|
Google vs Samsung


ఆండ్రాయిడ్ రూపకర్త గూగుల్ సరికొత్త నెక్సస్ 7 టాబ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అసస్‌చే రూపొందించిబడిన ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 డాట్‌కామ్ వారు రూ.15,884కు ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల టాబ్లెట్ పీసీల మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిన గుగూల్ నెక్సస్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 310 నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎదుర్కోవల్సి ఉంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్‌ను మేలో విడుదల చేశారు. ధర రూ. 23,250. ఈ నేపధ్యంలో మీ ఓటు ఏ గ్యాడ్జెట్‌కు వేస్తారు..?

చుట్టుకొలతలు:

గెలాక్సీ టాబ్‌తో పోలిస్తే నెక్సస్ 7 స్వల్పంగా మందపు శరీరతత్వాన్ని కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 344గ్రాముల బరువుతో 193.7 x 122.4 x 10.5mmచుట్టుకొలతలను కలిగి ఉండగా, నెక్సస్ 7 340 గ్రాముల బరువుతో 198.5 x 120 x 10.45mm చుట్టుకొలతను ఏర్పాటు చేసుకుంది.

డిస్‌ప్లే:

నెక్సస్ 7, స్ర్కాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గ్లాస్‌తో కూడిన 7 అంగుళాల బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 800పిక్సల్స్. సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్‌టీ WSVGA డిస్‌ప్లేతో డిజైన్ కాబడింది (రిసల్యూషన్ సామర్ధ్యం 1024 X 600పిక్సల్స్).

ఆపరేటింగ్ సిస్టం:

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. గుగూల్ నెక్సస్ 7 ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంతో పోలిస్తే జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం మెరుగైన పనీరును ప్రదర్శిస్తుంది. ఈ వోఎస్ సౌలభ్యతతో కొత్త కొత్త ఫీచర్లను యూజర్ ఆస్వాదించవచ్చు.

ప్రాసెసర్:

గుగూల్ నెక్సస్ 7 ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్ అదేవిధంగా 12 కోర్ గ్రాఫిక్స్ చిప్‌ను కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 2 310, 1 గిగాహెట్జ్ సామర్ధ్యం కలిగిన టీఐ ఓఎమ్ఏపీ డ్యూయల్ కోర్

ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా :

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్‌కు సహకరించే ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరాను కలిగి ఉంది. జియో టాగింగ్, స్మైల్ డిటెక్షన్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఒదిగి ఉన్నాయి. వీడియోలను 720 పిక్సల్ రిసల్యూషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ వేగం 30. గుగూల్ నెక్సస్ 7 కేవలం 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వీడియోలను 720 పిక్సల్ రిసల్యూషన్‌తో రికార్డ్ చేసకోవచ్చు.

స్టోరేజ్:

నెక్సస్ 7 8జీబి,16జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో 8జీబి వర్షన్‌ను మాత్రమే విక్రయిస్తున్నారు. గెలాక్సీ టాబ్ 2 310 16జీబి మెమరీ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. నెక్సస్ 7లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ లోపించింది.

బ్యాటరీ:

నెక్సస్7లో అమర్చిన నాన్-రిమూవబుల్ 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ 8 గంటల వీడియో ప్లేబ్యాక్‌తో పాటు 300గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. గెలాక్సీ టాబ్ 2 310లో అమర్చిన నాన్-రిమూవబుల్ 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 7 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదు.

కనెక్టువిటీ ఆప్షన్లు:

నెక్సస్ 7:

నాన్-3జీ,

వై-ఫై 802.11 a/b/g/n,

బ్లూటూత్,

ఎన్ఎఫ్‌సీ ఫంక్షన్,

ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసిన గుగూల్ వాలెట్,

3.5ఎమ్ఎమ్ హెడ్‌సెట్ జాక్.

గెలాక్సీ టాబ్2 310:

వై-పై 802.11 a/b/g/n,

డీఎల్ఎన్ఏ,

వై-ఫై డైరెక్ట్,

వై-ఫై హాట్‌స్పాట్,

డ్యూయల్ బ్యాండ్,

బ్లూటూత్ వీ3.0 వర్షన్,

3జీ కనెక్టువిటీ (డేటా స్పీడ్ HSDPA 21Mbps and HSUPA 5.76Mbps).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X