గూగుల్ కంప్యూటర్ వస్తుందోచ్.... రూ.5000కే!

Posted By: Prashanth

గూగుల్ కంప్యూటర్ వస్తుందోచ్.... రూ.5000కే!

 

సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ $99 (రూ.5,000 ధర పరధిలో) నెక్సస్ టాబ్లెట్‌ను రూపొందింస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. ప్రముఖ టెక్ డైలీ డిగీటైమ్స్ ఈ టాబ్లెట్  కంప్యూటర్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. సేకరించిన సమాచారం మేరకు ఈ టాబ్లెట్ 800మెగాహెడ్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌లను చైనాకు చెందిన వండర్ మీడియా టెక్నాలజీస్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే టాబ్లెట్ స్ర్కీన్ 7 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుది. రిసల్యూషన్1024x 800పిక్సల్స్.

తైవాన్‌కు చెందిన హాన్‌స్టార్ డిస్‌ప్లే టెక్నాలజీస్ ఈ టీఎన్ ప్యానళ్లను సమకూర్చినట్లు డిగీటైమ్స్ పేర్కొంది. తైవాన్‌కు చెందిన క్వాంటా కంప్యూటర్ ద్వారా ఈ టాబ్లెట్‌ల ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఈ టాబ్లెట్‌ను అక్టోబర్ 29న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూగుల్ ఆవిష్కరించనుందని ఈ ఆంగ్ల టెక్ పోర్టల్ వెల్లడించింది. ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి గూగుల్ ఇప్పటికే ఆహ్వాన పత్రాలను ఇప్పటిచే పలు మీడియా గ్రూపులకు పంపిందట. గూగుల్ తొలి నెక్సస్ టాబ్లెట్‌ను అసస్ ఉత్ఫత్తి చేసిన విషయం తెలిసిందే. ధర $199 (రూ.10,000!). 8జీబి ఇంకా 16జీబి వర్షన్‌లలో మాత్రమే ఈ టాబ్లెట్ లభ్యమవుతుంది. 32జీబి వర్షన్‌ను గూగుల్ త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting