దీపావళి కబురు.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్వైప్ టాబ్లెట్ లు!

Posted By: Staff

 దీపావళి కబురు.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్వైప్ టాబ్లెట్ లు!

 

ఈ దీపావళి పండుగను పురస్కరించకుని టాబ్లెట్ పీసీని కొనుగోలు చేద్దామనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రముఖ టాబ్లెట్ తయారీ సంస్థ స్వైప్ టిలికామ్ ‘హాలో 3జీ ట్యాబ్’, ‘హాలో ఎడ్జ్’ వేరియంట్‌లలో రెండు సరికొత్త టాబ్లెట్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 3జీ సామర్ద్యం కలిగిన హాలో 3జీ ట్యాబ్ ధర రూ.9,999 కాగా, హాలో ఎడ్జ్ ధర రూ.8,999.

కీలక స్పెసిఫికేషన్‌‍లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి డీడీఆర్3 ర్యామ్, బాక్స్‌చిప్ ఏ10 ప్రాసెసర్, 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్.

హాలో 3జీ ట్యాబ్ ప్రత్యేకతలేంటి..?

స్లీక్ ఇంకా ఆకర్షణీయమైన డిజైనింగ్. హైడెఫినిషన్ 5 పాయింట్ మల్టీటచ్ స్ర్కీన్, యూజర్ ఫ్రెండ్లీ బ్యాక్లిట్ ఎల్ఈడి నేవిగేషన్ బటన్స్. 4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ, సిమ్‌కార్డ్ స్లాట్ (3జీ ఇంకా 2జీ సపోర్టబుల్).

హాలో ఎడ్జ్ ప్రత్యేకతలేంటి..?

ఎడ్జ్ టెక్నాలజీ, వీడియో కాలింగ్, హైడెఫినిషన్ 5 పాయింట్ మల్టీటచ్ స్ర్కీన్, బాక్స్‌చిప్ ఏ10 ప్రాసెసర్, 4జీబి ఇన్‌బుల్ల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 30 ప్రీలోడెడ్ అప్లికేషన్స్. మల్టీ మీడియా ఫీచర్లు.

Read in Telugu

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting