ఎప్పుడైనా.. ఎక్కడైనా ‘డోంట్ కేర్’

Posted By: Staff

ఎప్పుడైనా.. ఎక్కడైనా ‘డోంట్ కేర్’

 

మొబైల్ కంప్యూటర్స్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్‌లను దృఢంగా తీర్చిదిద్దటంలో హ్యాండ్‌హెల్డ్ గ్రూప్‌ది అందవేసిన చేయి. ఈ కంపెనీ తాజాగా ఫీల్డ్ ప్రొఫెషనల్స్ కోసం ‘ఆల్‌గిజ్ 10ఎక్స్’(Algiz 10X) పేరుతో పటిష్టమైన టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రకటించింది. మిలటరీ స్టాండర్డ్ రేటింగ్ (MIL-STD-810G)ను దక్కించుకున్న ఈ డివైజ్ దుమ్ము, నీరు, వైబ్రేషన్స్, కఠిన ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొగలదు. బరువు 1.3 కిలోగ్రాములు, మందం 32మిల్లీమీటర్లు, స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు (ప్రత్యేకమైన టచ్ స్ర్కీన్ వ్యవస్థ). యూ-బ్లాక్స్ జీపీఎస్ రిసీవర్ వ్యవస్థ‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ప్లస్ బ్లూటూత్ 4.0 బి/జి/ఎన్, డబ్ల్యూడబ్ల్యూఏఎన్ గోబి 3000 వంటి ప్రత్యేక ఫీచర్లు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే..:

5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

వాటర్‌ప్రూఫ్ యూఎస్బీ 2.0, వీజీఏ ఇంకా ఆర్ఎస్232 పోర్ట్స్,

శక్తివంతమైన ఇంటెల్ ఆటమ్ ఎన్2800 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

4జీబి డీడీఆర్3 ర్యామ్,

ఎస్ఎస్‌డి డిస్క్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్,

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం (త్వరలో విండోస్ 8కు అప్ గ్రేడబుల్).

వచ్చే ఏడాది జనవరి నాటికి ఆల్‌గిజ్ 10ఎక్స్ అందుబాటులోకి రానుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot