10 వసంతాలు పూర్తి చేసుకున్న జీమెయిల్!

Posted By:

జీమెయిల్ గురించి తెలియని ఇంటర్నెట్ యూజర్ అంటూ ఈ ప్రపంచంలో ఉండరు. గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సేవల్లో జీమెయిల్ ఒకటి. కమ్యూనికేషన్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న జీమెయిల్ ఏప్రిల్ 1, 2014తో 10 వసంతాలను పూర్తి చేసుకుంది. వికీపిడియా ఆధారంగా సేకరించిన వివరాల మేరకు జీమెయిల్‌ను బేటా వర్షన్ క్రింద ఏప్రిల్ 1, 2004లో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7, 2007 నుంచి ఈ సర్వీస్ పబ్లిక్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

10 వసంతాలు పూర్తి చేసుకున్న జీమెయిల్!

ఈ పది సంవత్సరాల కాలంలో జీమెయిల్ తన స్టోరేజ్ శాతాన్ని 1జీబి నుంచి 7.5జీబి వరకు క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. గతేడాది ఈ స్టోరేజ్ శాతాన్ని మరో 2.5జీబికి పొడిగిస్తూ, జీమెయిల్ టీమ్ ఓ ప్రకటనను జారీ చేసింది. అంటే జీమెయిల్‌లో లభ్యమయ్యే ఉచిత స్టోరేజ్ శాతం 10జీబి అన్నమాట. ఈ ఉచిత స్టోరేజ్ వెసలుబాటు జీమెయిల్ యూజర్లందరికి వర్తిస్తుంది.

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే

మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot