Home
Computer

ఇంజినీర్స్ డే.. నవ శకానికి నాంది

భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 -1962) జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టంబర్ 15వ తేదీన జాతీయ ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజినీర్‌‍గాను, పాలనాదక్షునిగా ఎంతో కీర్తిని సొంతం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 సంవత్సరాల పాటు అపారమైన సేవలనందించిన విశ్వేశ్వరయ్య దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డారు.

ఇంజినీర్స్ డే.. నవ శకానికి నాంది

1884లో పూణే సైన్స్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసుకున్న విశ్వేశ్వరయ్య నేరుగా గవర్నమెంట్ ఆఫ్ బోంబే (ఇప్పటి ముంబై) ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియామకమయ్యారు. ఆ తరువాత భారత నీటిపారుదల కమీషన్ విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను రూపొందిచారు. ఈయన రూపొందించిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను 1903లో మొదటిసారిగా పూణే దగ్గర ఖడక్ వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ విధానానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. ఆ తరువాత గ్వాలియర్‌లోని అలతిగ్రా వద్ద మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోనూ ఈ ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను ఉపయోగించారు.

1908లో మూసి నదికి వరద రావడంతో హైదరాబాద్ నగరం ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వర్యను ఆహ్వానించి సమస్యకు పరిష్కారం వెతకాలని కోరటంతో పటిష్టమైన నగర మురుగునీటి పారుదల పథకాన్ని విశ్వేశ్వర్య రూపొందించారు. ఆ తరువాత మూసీ, ఈసీ నదుల పై రిజర్వాయర్లను నిర్మించటంతో హైదరాబాద్ నగరానికి వరద ప్రమాదం తప్పింది. విశేఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలోనూ విశ్వేశ్వరయ్య పాత్ర ఉంది.

1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించడంలోనూ విశ్వేశ్వరయ్య ప్రముఖ పాత్ర పోషించారు. 1908లో స్వఛ్చంద పదవీ విరమణ అనంతరం మైసూర్ సంస్థానంలో దివానుగా కృషి చేసిన విశ్వేశ్వరయ్యకు బ్రిటీషు ప్రభుత్వం నైట్‌హుడ్ (సర్) బిరుదు ఇచ్చింది. 1955లో భారద దేశపు అత్యంత గొప్ప పురస్కారం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వరించింది.

సెప్టంబర్ 15 జాతీయ ఇంజినీర్స్ డే సందర్భంగా భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను గుర్తుచేసకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భారతదేశంలో ఇంజినీరింగ్ వృత్తి నిపుణులు తమ నైపుణ్యాలను దేశాభివృద్థికి వినియోగించాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Happy Engineers Day: All you want to know about Engineers Day. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X