‘రా...వన్’ పబ్లిసిటీని వాడుకుంటున్న హాట్ బ్రాండ్..?

Posted By: Staff

‘రా...వన్’ పబ్లిసిటీని వాడుకుంటున్న హాట్ బ్రాండ్..?


‘రా..వన్’ పబ్లిసిటీని క్యాష్ చేసుకుంటున్న ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు..?, క్లాసికల్ హిరో ‘కింగ్ ఖాన్ షారూక్’ను ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ పోజ్ చేస్తున్న హాట్ ప్రుడక్ట్ ఇండియాదేనా..?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరో మైలురాయిని అధిగమించేందకు దీపావళి కానుకగా విడుదల కాబోతున్న కింగ్ షారూక్ ‘రా..వన్’ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు నెలకున్నాయి. కనివిని ఎరగని గ్రాఫిక్ అద్భుతాలతో రూపుదిద్దుకున్న చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలకొట్టటం ఖాయమని సిని వర్గాల టాక్. అయితే ‘రా..వన్’ పబ్లిసిటీని క్యాష్ చేసుకునే విధంగా ప్రముఖ కంప్యూటర పరికరాల తయారీదారు ‘హెచ్ సీఎల్’ ప్రణాళిక సిద్ధం చేసింది.

‘రా.. వన్’ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదర్చుకున్న ‘హెచ్ సీఎల్ ఇన్ఫోసిన్’ హైడెఫినిషన్ ల్యాప్ టాప్ పరికరాలను దీపావళి కానుకగా మార్కెట్లో విడుదల చేసింది. ‘రా..వన్’స్థాయిలో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్లు ‘Xite 2025, Xite 2035, HCL ME Icon 1034’మోడళ్లలో లభ్యం కానున్నాయి. వర్షన్లను బట్టి వారంటీని పొందవచ్చు. అదనంగా McAfee antivirus సాఫ్ట్ వేర్ ను సొంతం చేసుకోవచ్చు.

‘హై డెఫినిషన్’ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీల ద్వారా ‘సినిమా ధియోటర్’అనుభూతిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. ‘రా..వన్’ తరహా అత్యాధునిక గ్రాఫిక్ మరియు హైడెఫినిషన్ పీచర్లతో రూపుదిద్దకున్న ‘హెచ్ సీఎల్’ స్పెషల్ గ్యాడ్జెట్లు ప్రయాణ సందర్భాల్లో సైతం మన్నికైన వినోదాన్ని పంచుతాయి.

క్లుప్తంగా ఫీచర్లు:

- నాణ్యమైన ‘హై డెఫినిషన్’ డిస్ ప్లే,

- శక్తివంతమైన గ్రాఫిక్ కార్డు,

- మన్నికైన స్టీరియో స్పీకర్ సిస్టమ్,

- ఎల్ ఈడీ బ్యాక్ లిట్ స్క్రీన్ మరియు స్లిమ్ బాడీ

- అక్టోబర్ 31లోపు స్సెషల్ ఆఫర్ల ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు.స

- వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ ల్యాపీ పరికరాల ధరలు రూ.32,000 నుంచి రూ.42000 మధ్య ఉన్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting