హెచ్‌సీఎల్ నుంచి సరికొత్త 3జీ టాబ్లెట్!

Posted By: Staff

హెచ్‌సీఎల్ నుంచి సరికొత్త 3జీ టాబ్లెట్!

 

ఇండియా ఆధారిత టెక్నాలజీ పరికరాల తయారీ సంస్థ  హెచ్‌సీఎల్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్  ‘హెచ్‌సీఎల్ మీ జీ1’(HCL ME G1) పేరుతో సరికొత్త 3జీ టాబ్లెట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది.

9.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగిన ఈ డివైజ్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.  ధర రూ.14,999. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

ఆండ్రాయిడ్ 4.0.4 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసింగ్ యూనిట్, థింక్‌ఫ్రీ ఆఫీస్ ప్రొడక్టువిటీ(మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్‌లను ఓపెన్ ఇంకా ఎడిట్ చేసుకునేందుకు, పీడీఎఫ్ ఫైళ్లను సైతం వీక్షించవచ్చు), 9.7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్, 3జీ వయా యూఎస్బీ కనెక్టువిటీ డేటాకార్డ్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 4.0+ఈడీఆర్, మీ అప్లికేషన్ స్టోర్, 7000ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ.

నచ్చిన ఫోన్.. నచ్చిన రేటుకు!

తాము కొనుగోలు చేసిన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్ మరింత మన్నికతో విశ్వసనీయమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. మొబైల్ కొనుగోలు చేయటానికి డబ్బులుంటే చాలనుకుంటే పొరపాటు. ఉత్తమ మొబైల్ ఎంపిక విషయంలో అవగాహనతో పాటు తులనాత్మక అంచనా తప్పనిసరి. మీరు ఎంపిక చేసుకున్న డివైజ్‌ను అన్ని అంశాల్లో వేరే డివైజ్‌లతో అంచనా వేసి ఓ సమగ్ర మైన అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు సహాయపడేందుకు ఆన్‌లైన్ ప్రైస్ కంపారిజన్ ఇంజన్ గోప్రోబో డాట్ కామ్ (goProbo.com) మీ ముందుకొచ్చింది. ఈ సైట్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ పట్ల నిశితమైన అవగాహనకు వచ్చి నచ్చిన ధరల్లో సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారుకు.. ఆన్‌లైన్ రిటైలర్‌కు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న గోప్రోబ్ డాట్ కామ్ విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తుంది. ఈ సైట్‌లోకి ప్రవేశించిన వినియోగదారు అన్ని జాతీయ అంతర్జాతీయ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను స్పెసిఫికేషన్‌లతో సహా తెలుసుకోవచ్చు. ఆయా డివైజ్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ధర రాయితీలను సైతం వినియోగదారు తెలుసుకోవచ్చు.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot