‘హెచ్ సీఎల్’ కొత్త శకానికి నాంది..!!

Posted By: Staff

‘హెచ్ సీఎల్’ కొత్త శకానికి నాంది..!!

దేశంలో టెక్ విప్లవం రాజుకుందా..?, నూతన సాంకేతిక ప్రయోగాలు కొత్త శకానికి నాంది పలకనున్నాయా...?, వినియోగదారులు తమ పంధాను మార్చుకుంటున్నారా..?, అవుననే అంటున్నాయి విశ్లేషక వర్గాలు. సాంకేతిక వినయోగాదారులు అత్యధికంగా ఉన్న భారతీయ మార్కెట్లో, టెక్ సంస్కృతి కొత్త పుంతల తొక్కుతుంది. వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడతున్న పలు సంస్థలు అతి తక్కువ ధరలకే సాంకేతిక పరికరాలను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆకాష్, రిలయన్స్, బీటెల్ మ్యాజిక్, ఐబాల్, లక్ష్మీ వంటి సంస్థలు అత్యల్ప ధరకే టాబ్లెట్ పరికరాలను అందిస్తామంటూ ముందుకొచ్చాయి. తాజాగా ఇదే కోవలోకి హిందూస్ధాన్ కంప్యూటర్ లిమిటెడ్ (హెచ్ సీఎల్) వచ్చి చేరింది.

భారతీయ టాబ్లెట్ మార్కెట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన‘హెచ్ సీఎల్’ కేవలం రూ. 10,490కే, అత్యాధునిక టాబ్లెట్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది.
‘హెచ్ సీఎల్ Me X1’ వర్షన్లో విడుదలైన టాబ్లెట్ పీసీ ఫీచర్ల వివరాలు :

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్లో లోడ్ చేశారు.

-1 GHz ఆర్మ్ కార్టెక్స్ A8 ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతంగా స్పందిస్తుంది.

- 512 ఎంబీ ర్యామ్ వ్యవస్థ పటిష్ట సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- 7 అంగుళాల స్ర్కీన్, 800 x 480 పిక్సల్ హై రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- మల్టీ టచ్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

- టాబ్లెట్ ముందు భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన వీడియో ఛాటింగ్ కు ఉపకరిస్తుంది.

- 4 జీబీ ఇంటర్నెల్ మెమరీని, 32 జీబీకి పెంచుకోవచ్చు.

- ఎఫ్ఎమ్ రేడియో, తదితర సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్లను టాబ్లెట్లో ముందుగానే లోడ్ చేశారు.

- 3జీ, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టువిటీ అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

- టాబ్లెట్లో అమర్చిన 3500 mAh బ్యాటరీ వ్యవస్థ సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot