ప్రచారకర్తగా సోయగాల సుందరి.. హెచ్‌సీఎల్ తొలి అల్ట్రాబుక్ సిద్ధం!

Posted By: Super

ప్రచారకర్తగా సోయగాల సుందరి.. హెచ్‌సీఎల్ తొలి అల్ట్రాబుక్ సిద్ధం!

 

 

న్యూఢిల్లీ: కంప్యూటర్ల తయరీ విభాగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తున్న హెచ్ సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ తన తొలి అల్ట్రాబుక్  ‘అల్ట్రా స్మార్ట్ ఎంఈ సిరీస్ 3074’ని బుధవారం ఆవిష్కరించింది.  ధర రూ.51,990.  ఈ కంప్యూటింగ్ డివైజ్ ను వచ్చే వారం నుంచి రిటైలింగ్ మార్కెట్లో విక్రయించనున్నారు. ఇదే కాకుండా వచ్చే మూడు నెలల కాలంలో మరో మూడు సరికొత్త అల్ట్రాబుక్ లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రిన్సీ భట్నాకర్ తెలిపారు. సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ప్రముఖ మోడల్ నర్గీష్ ఫక్రీ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఎంఈ సిరీస్ 3074 ఫీచర్లు:

స్లీక్ డిజైనింగ్ (కేవలం 18మిల్లీమీటర్ల మందం),

ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,

39నెలల వారంటీ,

4జీబి ర్యామ్ (అప్ గ్రేడబుల్ టూ 8జీబి),

ఇంటర్నల్ హార్డ్ డిస్క్- 32జీబి సామర్ధ్యం,

1.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

బ్లూటూత్,

వై-ఫై సామర్ద్యం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot