డేటా మొత్తం దాచేయండి..

|

రోజువారి కమ్యూనికేషన్ అవసరాల రిత్యా మనలో చాలా మంది యూజర్లు తమ వ్యక్తిగత డేటాను స్మార్ట్‌ఫోన్స్ అలానే ల్యాప్‌టాప్‌లలో స్టోర్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మొహమాటం కొద్ది మన వ్యక్తిగత డివైస్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంటుంది. ఇలా ఇచ్చినప్పుడు కొందరు వ్యక్తులు మన డివైస్‌తో ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తారు.

Hide anything on Windows PC this way

మరికొందరు మాత్రం ఆ డివైస్ మనది కాదని తెలిసినా ఆ డివైస్‌లోని వ్యక్తగత డేటాను తెలుసుకోవాలన్న కుతూహలంతో యజమాని ప్రమేయం లేకుండానే మొత్తం జల్లెడపట్టేస్తారు. ఇలాంటి వాళ్లి చేతికి మన వ్యక్తిగత డివైస్‌లను ఇచ్చే ముందు లోపలి ఫైల్స్ అన్నింటిని హైడ్ చేసి ఇస్తే బాగుంటుంది. విండోస్ పీసీల్లో వ్యక్తిగత డేటాను హైడ్ చేసుకునేందుకు కొన్ని స్మార్ట్ ట్రిక్స్...

ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను హైడ్ చేసుకునేందకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను హైడ్ చేసుకునేందకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1 : ముందుగా File Explorerను ఓపెన్ చేయండి.

స్టెప్ 2 : ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అయిన తరువాత హైడ్ చేయాలనుకుంటన్న ఫైల్ లేదా ఫోల్డర్ వద్దకు నేవిగేట్ అవ్వండి

స్టెప్ 3 : సెలక్ట్ చేసుకన్న ఫైల్ లేదా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళ్లండి.

స్టెప్ 4 : ప్రాపర్టీస్‌కు సంబంధించిన జనరల్ ట్యాబ్‌లో Attributes క్రింద హిడెన్ ఆప్షన్‌ను చెక్ చేసి అప్లై బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫైల్ హైడ్ కాబడుతుంది.

కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ..

కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ..

ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్లి కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ పేజీ ఓపెన్ అయిన తరువాత హైడ్ చేయాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌కు సంబంధించి కమాండ్‌లను ఇవ్వవల్సి ఉంటుంది.

ఉదహరణకు మీరు TEXT అనే పేరుతో ఉన్న పైల్‌ను హైడ్ చేయలనుకుంటున్నట్లయితే ఈ కమాండ్‌ (attrib "G:TEXT.txt" +s +r +h)ను టైప్ చేసి ఎంటర్ బటన్ పై హిట్ చేస్తే సరిపోతుంది.

కమాండ్ ప్రాంప్ట్ ద్వారా NEW Folder అనే పేరుతో ఉన్న ఫోల్డర్‌ను హైడ్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ కమాండ్‌ను టైప్ చేసి attrib "G:NEW Folder" +s +r +h ఎంటర్ బటన్ పై హిట్ చేస్తే సరిపోతుంది.

డిస్క్ మేనేజ్‌మెంట్ యుటిలిటీ ద్వారా..

డిస్క్ మేనేజ్‌మెంట్ యుటిలిటీ ద్వారా..

ముందుగా కీబోర్డ్ పై విండోస్ కీ + ఆర్ బటన్ క్లిక్ చేసినట్లయితే రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో diskmgmt.msc అని టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి. డిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ విండో ఓపెన్ అవుతుంది.

ఈ విండోలో మీరు హైడ్ చేయాలనుకుంటున్న డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి Change Drive Letter and Paths ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెంటనే మీకా డ్రైవ్‌కు సంబంధించి ఛేంజ్, రిమూవ్, యాడ్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి ద్వారా డ్రైవ్ లెటర్‌‌తో పాటు పాత్‌ను మార్చుకుని డ్రైవ్‌ను హైడ్ చేసుకోవచ్చు.

ఆపిల్ కంపెనీకి చిక్కులు, వారెంట్ నోటీసులుఆపిల్ కంపెనీకి చిక్కులు, వారెంట్ నోటీసులు

థర్ట్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా...

థర్ట్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా...

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పైల్‌ఫ్రెండ్, సీక్రెట్ డిస్క్, ఈజీ ఫైల్ లాకర్ వంటి థర్ట్ పార్టీ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకుని ఫైల్స్‌‍ను హైడ్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
We all need privacy even in the family! If we are sharing a desktop, we may have some personal files that we want to hide from others.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X