హై డెఫినిషన్ టాబ్లెట్‌ రాక ఎప్పుడు..?

Posted By: Staff

హై డెఫినిషన్  టాబ్లెట్‌  రాక ఎప్పుడు..?

 

మీరు ఆండ్రాయిడ్ టాబ్లెట్ కోనేందుకు ప్లాన్ చేస్తున్నారా..?, మీకు బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయండి..!!, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్  సిస్థం ఆధారితంగా రన్ అవుతున్న టాబ్లెట్ డివైజ్‌లు సంఖ్య ప్రస్తుత మార్కెట్లో వందలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి హైడెఫినిషన్ సామర్ధ్యం గల ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చి పడింది. ఈ పీసీని డిజైన్ చేసింది ఏవరో తెలుసా..?, ఇంకెవరు వన్ అండ్ వోన్లీ  ‘స్కై ప్యాడ్ ఆల్ఫా’(Skypad alpha).

న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల కాబోతున్న ‘స్కై ఆల్పా 2’ పనితీరు వినియోగదారుడిని మెప్పిస్తుంది. గుగూల్ ఆండ్రాయిడ్   v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై  టాబ్లెట్ రన్ అవుతుంది. అపగ్రేడెడ్ వర్షన్ అయిన ARM Cortex A8 ప్రాసెసింగ్ వ్యవస్థను పీసీలో నిక్షిప్తం చేశారు. డివైజ్‌లో పొందుపరిచిన కూల్ గ్రాఫిక్ వ్యవస్థ  ‘మాలీ 400 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్’ మన్నికైన గ్రాఫిక్ విజువల్స్‌ను విడుదల చేస్తుంది. పీసీలోని వీడియోలను 1080 పిక్సల్  సామర్ధ్యం గల  హై డెఫినిషన్‌తో తిలకించవచ్చు. స్టీరియో స్కోపిక్ 3డీ వీడియో ఫైళ్లను ‘స్కైప్యాడ్ ఆల్పా’ సపోర్ట్ చేస్తుంది.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన ‘v1.4 హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్’ సౌలభ్యతతో  హై డెఫినిషన్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు.  7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ ఆపరేటింగ్‌కు మరింత అనువుగా  ఉంటుంది.  ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting