భారత్ మార్కెట్లోకి హాంకాంగ్ కంప్యూటర్లు!

Posted By: Staff

భారత్ మార్కెట్లోకి హాంకాంగ్ కంప్యూటర్లు!

 

 

హాంకాంగ్  దేశానికి చెందిన ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్’ (EKEN  Electronics) భారత్‌లో తక్కువ ధర టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించింది. ‘ఈకెఈఎన్ లియోపార్డ్’('EKEN Leopard') బ్రాండ్ క్రింద విడుదలైన ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల ధరలు వివిధ శ్రేణులను బట్టి రూ.6,900- రూ.11,999 మధ్య ఉంటాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలకు భారత్ వంటి మార్కెట్లలో అధిక డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు  ఈకెఈఎన్ ఎలక్ట్ర్రానిక్స్ సీఈవో ఎడిసన్ చాంగ్ తెలిపారు. ఈ టాబ్లెట్ కంప్యూటర్ల విక్రయాల్లో భాగంగా ఈకెఈఎన్ సంస్థ కేరళకు చెందిన ఆల్డోస్ గ్టేర్ ట్రేడ్ & ఎక్స్‌పోర్ట్స్‌తో ఒప్పందం  ఏర్పరుచుకుంది. ముందుగా వీటిని కేరళలో విక్రయించనున్నారు.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

స్ర్కీన్ వేరియంట్స్ (7 అంగుళాలు, 8 అంగుళాల, 9.7 అంగుళాలు),

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

3జీ కనెక్టువిటీ, జీపీఎస్,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్),

1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

బరువు 230 గ్రాములు,

గూగుల్ ప్లేస్టోర్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting