వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

Posted By:

వాట్స్‌యాప్.. ఈ చాటింగ్ అప్లికేషన్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య చాలా తక్కువే అనాలి. వాట్స్‌యాప్ ద్వారా టెక్స్ట్, వాయిస్ సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలను స్మార్ట్‌ఫోన్ యూజర్ల చాలా సౌకర్యవంతంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఉపయుక్తమైన మెసేజింగ్ సర్వీస్‌ను చాలా మందికి స్మార్ట్‌‍ఫోన్‌లలో మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోవటం తెలుసు. అయితే, వాట్స్ యాప్‌ను మీ వ్యక్తిగత కంప్యూటర్‌లలో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది ఏలాగో క్రింది స్లైడ్ షోలో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

వాస్తవానికి వాట్స్‌యాప్ ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. అయితే, ఈ అప్లికేషన్‌‍‌ను మన పీసీలో కూడా ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకునే అవకాశాన్ని బ్లూస్టాక్స్ అనే సాఫ్ట్‌వేర్ కల్పిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని విండోస్, మ్యాక్ తదితర ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు. బ్లూస్టాక్స్ అప్లికేషన్‌ను http://www.bluestacks.com/ వద్ద నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

బ్లూస్టాక్స్ అప్లికేషన్‌ను మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకున్ను తరువాత సదరు యాప్‌ను పీసీలో ఇన్‌స్టాల్ చేయండి.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత బ్లూస్టాక్స్ యాప్‌ను ఓపెన్ చేయండి. బ్లూస్టాక్స్ యాప్ మీ డెస్క్‌టాప్ పై లోడైన తరువాత కనిపించే ‘Find' శోధనా బాక్సులో ‘Whatsapp messenger' అని టైప్ చేసి ‘Find' బటన్ పై క్లిక్ చేయండి.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఇప్పుడు కనిపించే శోధనా ఫలితాల్లో ‘Whatsapp messenger' కనిపిస్తుంది. సదరు ‘Whatsapp messenger' లింక్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ డౌన్‌లోడ్ అవుతుంది.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత బ్లూస్టాక్స్ పేజీలో యాప్స్ జాబితాలో కనిపించే ‘Whatsapp messenger 'ఐకాన్' పై క్లిక్ చేయండి.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీరు ‘Whatsapp messenger'లోని ‘verify your phone number' పేజీలోకి వెళతారు. ముందాగా కనిపించే ‘your country' కాలమ్‌లో మీ దేశాన్ని ఎంపిక చేసుకోండి.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆ తరువాత ‘your country code and phone number' కాలమ్‌లో మీ దేశపు కోడ్‌తో మీ ఫోన్ నెంబర్‌ను టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

ఆ తరువాత వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ చర్యలో భాగంగా మీ మొబైల్ నెంబర్‌కు మూడు అంకెల కోడ్ మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి వాయిస్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. ఆ కోడ్‌ను సంబంధింత కాలమ్‌లో టైప్  చేసినట్లయితే. మీ వాట్స్‌యాప్ అకౌంట్ పీసీలో యాక్టివేట్ అయినట్లే.

వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

తరువాతి చర్యలో భాగంగా మీ పేరును నమోదు చేసి మెనూలోకి ప్రవేశించి మీ మిత్రులను యాడ్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to install whatsapp on pc. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot