పాస్‌వర్డ్ మిస్సైందా..?
ప్రతి ఈమెయిల్ అకౌంట్‌కు పాస్‌వర్డ్ తప్పనిసరి. యూజర్ తన మెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేయవల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. కొందరు తమ ఈమెయిల్ అకౌంట్‌లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మర్చిపోతుంటారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
పాస్‌వర్డ్ మరిచిపోయిన సందర్భంలో తిరిగి పాస్‌వర్డ్‌ను పొందేందుకు సదరు వెబ్‌సైట్ సర్వర్ కంప్యూటర్‌కు ఓ విజ్ఞప్తిని పంపవల్సి ఉంటుంది. తద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
మెయిల్ ఎకౌంట్ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్ మర్చిపోయినా డేటాను రికవర్ చేయవచ్చు. కాకపోతే రెండు మూడు నెలల సమయం పడుతుంది. గుర్తింపు వివరాలు, వ్యక్తిగత సమాచారం, మెయిల్ ఐడీకి ఎక్కువగా వచ్చే మెయిల్స్, మెయిల్ హెడ్డర్ లాంటి వివరాలను మెయిల్ నిర్వాహకులకు పంపాలి.
మొబైల్‌ను స్కాన్ చేసి వైరస్ జాడల్ని వెతికి పట్టేయాలంటే యాంటీ వైరస్‌ను మీ హ్యాండ్ సెట్‌లో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ అప్లికేషన్‌లోని షెడ్యూల్ స్కానింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవటం ద్వారా నిర్ణీత సమయానికి ఆటోమాటిక్‌గా మీ ఫోన్ స్కాన్ అయిపోతుంది. సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ సమయంలో ఏవిధమైన వైరస్ లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. వెబ్‌సైట్‌లు, ఈమెయిళ్లు, ఎసెమ్మెస్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసే డేటాని కూడా స్కాన్ చేస్తుంది. మొబైల్‌ను పొగొట్టుకుంటే జీపీఎస్ సదుపాయంతో ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మొబైల్‌కు తాళం వేసి డేటా మొత్తాన్ని చెరిపేసే వీలుంది.


Click it and Unblock the Notifications








