బ్రౌజింగ్ టైంలో ఆటో ప్లే వీడియోలు ఇబ్బంది పెడుతున్నాయా ?

|

మనం తరచూ కొన్ని వెబ్‌సైట్స్ విజిట్ చేస్తూ ఉంటాం. అందులో యాడ్స్ అనేవి చిరాకు తెప్పించడం సాధారణమే. అయితే వాటిలో కొన్ని వీడియో యాడ్స్ కూడా ఉంటాయి. మనం క్లిక్ అనిపించిన, అనిపించకపోయినా వెంటనే వీడియోలు ప్లే అయిపోతాయి. అందులో ఒక్కో సారి అభ్యంతరకరమైనవి కూడా ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి వీడియోలు ఆటో ప్లే ఆప్షన్స్ ను కలిగి ఉంటాయి. మన ప్రమేయం లేకపోయినా అవి ఆలోమేటిగ్గా ప్లే కావడంతో పక్కనే ఉన్నావారు మనమే ప్లే చేసి చూస్తున్నామని భ్రమపడే అవకాశం కూడా ఉంది. అవి అశ్లీల వీడియోలు అయితే ఇక చెప్పనే అవసరం లేదు. వాటికి ఎలా పుల్ స్టాప్ పెట్టాలో తెలియక చాలామంది నిరాశతో ఉంటారు. అటువంటి వారు ఈ ప్రాబ్లం నుంచి బయట పడేది ఎలా అనే దానికి మీకు కొన్ని రకాల చిట్కాలు ఇస్తున్నాం..ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

మంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొనుటకు పది చిట్కాలుమంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొనుటకు పది చిట్కాలు

క్రోమ్ :

క్రోమ్ :

గూగుల్ కు చెందిన క్రోమ్ లో వీడియోస్ ను బ్లాక్ చేసే ఎక్స్ టెన్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా "సైలెంట్ సైట్ సౌండ్ బ్లాకర్" పేరిట ఉన్న ఈ ఎక్స్ టెన్షన్ టూల్ ఒక్కసారి ఇన్ స్టాల్ చేస్తే చాలు ఆటో ప్లే వీడియోలన్నీ మూగబోతాయి.

చూడాలనుకుంటే..

చూడాలనుకుంటే..

వీలైతే మనకు నచ్చని, నచ్చిన సైట్స్ ను వైట్ అండ్ బ్లాక్ లిస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఒక్కో సారి సదరు యాడ్ ను చూడాలనుకుంటే మాత్రం "అలౌ దిస్ టైం" అనే ఆప్షన్ ను ఎంచుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఈ టూల్ ఇన్ స్టాల్ చేశాక ఈ క్రింది నాలుగు ఆప్షన్ లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎ) అల్వేస్ అలోవ్ ( వైట్ లిస్ట్ సైట్స్ ఎంపికలో)

బి) అలోవ్ వన్స్ ( ప్రాంప్ట్ ఎగైన్)

సి) రిజెక్ట్ వన్స్ ( ప్రాంప్ట్ ఎగైన్ )

డి) నెవర్ అలోవ్ ( బ్లాక్ లిస్ట్ చేసిన సైట్స్ వచ్చినప్పుడు)

 

మరికొన్ని ఆప్షన్స్
 

మరికొన్ని ఆప్షన్స్

అలాగే ఈ టూల్ లో అందుబాటులో ఉండే మరికొన్ని ఆప్షన్స్

ఎ) అలోవ్ వైట్ లిస్టెడ్ ఓన్లీ

బి) అలోవ్ బ్లాక్ లిస్టెడ్ ఓన్లీ

సి) సైలెన్స్ ఆల్ సైట్స్ ( ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఎలాంటి ఆటో ప్లే వీడియోలు సౌండ్ చేయవు)

డి) అలోవ్ ఆల్ సైట్స్ ( ఇది ఎంచుకుంటే టూల్ డిజేబుల్ చేసినట్లే )

 

ఫైర్ ఫాక్స్ :

ఫైర్ ఫాక్స్ :

ఇక ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్స్ లో "మ్యూట్ సైట్స్ బై డిఫాల్ట్" ఆప్షన్ ఉంటుంది. అప్పుడు అన్ని సైట్స్ మ్యూట్ అయిపోతాయి. అయితే మనకు కావాల్సిన సైట్స్ ను మాత్రం వైట్ లిస్ట్ చేసుకునే వీలుంది. ఒక్కసారి ఈ యాడ్ ఆన్ ఎనేబుల్ చేసిన తర్వాత కావాల్సిన సైట్స్ మాత్రం వైట్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అప్పుడు సదరు వీడియోలు ప్లే అవుతాయి.

సఫారీ :

సఫారీ :

ఈ బ్రౌజర్ కు సంబంధించినంత వరకూ "ఓఎస్ టెన్ ఈఐ కెప్టెన్" వాడినట్లయితే అందులో ఆటో మేటిగ్గా మ్యూట్ ఫీచర్ అందుబాటులో ఉంది. అడ్రెస్ బార్ లో బ్లూ రంగులో ఉన్న ఈ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మ్యూట్, తీసేస్తే అన్ మ్యాట్ అవుతాయి.

 

 

ఒపెరా :

ఒపెరా :

ఈ బ్రౌజర్ లో ఏదైన ఒక ట్యాబ్ ని రైట్ క్లిక్ చేసి "మ్యూట్ అదర్ ట్యాబ్స్" ని ఎంచుకుంటే అప్పుడు అన్ని ట్యాబ్స్ మ్యూట్ అయిపోతాయి. అప్పుడు ఆటో ప్లే వీడియోలు మూగబోతాయి. అలాగే మళ్లీ వినాలి అనుకుంటే అన్ మ్యూట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ :

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ :

విండోస్ టెన్ యూజర్స్ లో అయితే ఎడ్జ్ బ్రౌజర్ లో మ్యూట్ చేసేందుకు ఎలాంటి ఆప్షన్స్ లేవు. అయితే "ఇయర్ ట్రంపెట్" అనే ఓ ఫ్రీ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఆటో ప్లే వీడియోలను మ్యూట్ చేయవచ్చు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో వచ్చే పాప్ ఆప్స్ ను అలౌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇయర్ ట్రంపెట్ యాప్ ప్రత్యక్షం అవుతుంది. అందులో వాల్యూం కంట్రోల్స్ ఉంటాయి. దీని ద్వారా ఎడ్జ్ బ్రౌజర్ లో ఆటో ప్లే వీడియోలను మ్యూట్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to mute sites with autoplaying videos more news at Gizbot telugu.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X