కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!

Posted By: Prashanth

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు!

 

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.......

- ఎఫ్1 ( F1) - సహాయం (హెల్ప్).

- కంట్రోల్ + ఈఎస్‌సీ (CTRL+ESC): ఓపెన్ స్టార్ మెనూ.

- ఆల్ట్ + టాబ్ (ALT+TAB): ఓపెన్ చేసి ఉన్న ప్రోగ్రామ్ లలోకి మారవచ్చు.

- ఆల్ట్ + ఎఫ్4 (ALT+F4) : ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించుట.

- షిప్ట్ + డిలీట్ (SHIFT+DELETE): శాస్వుతంగా డిలీట్ చేయుట.

- విండోస్ లోగో+ ఎల్ (Windows Logo+L) : లాక్ ద కంప్యూటర్.

- కంట్రోల్ + సీ ( CTRL+C): కాపీ,

- కంట్రోల్ + ఎక్స్ (CTRL+X): కట్,

- కంట్రోల్ + వీ ( CTRL+V): పేస్ట్,

- కంట్రోల్ + జడ్ (CTRL+Z): అండూ,

- కంట్రోల్ + బి (CTRL+B): బోల్డ్,

- కంట్రోల్ + యూ( CTRL+U): అండర్ లైన్,

- కంట్రోల్ + ఎల్ (CTRL+I): ఇటాలిక్.

మరిన్ని కీబోర్డ్ షాట్‌కట్స్ రేపటి  ‘కీబోర్డ్ షార్ట్‌కట్‌లు - 2’ శీర్షకలో...

మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవాలంటే..?

చాలామందికి తమ పీసీ సామర్ద్యం ఎంతో తెలియదు. కంప్యూటర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ కంప్యూటర్ కాన్ఫిగరేషన్‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తమ పీసీలోని ప్రాసెసర్, ర్యామ్, హార్డ్‌డిస్క్‌లకు సంబంధించి పూర్తి వివరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కంప్యూటర్ పనితీరు ముఖ్యంగా ఈ మూడు విభాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, ర్యామ్ వివరాలు తెలుసుకోవాలంటే ‘మై కంప్యూటర్’ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసిగాని, ‘కంట్రోల్ పేనల్‌’లోకి లాగినై గాని తెలుసుకోవచ్చు. హార్డ్‌డిస్క్ వివరాలు కావాలంటే మై కంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్‌డిస్క్ ఐకాన్ల పై రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్‌లోకి వెళితే తెలిసిపోతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting