మీ కంప్యూటర్ ‘స్పీడ్’ పెరగాలంటే..?

By Super
|
Install updates

మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు...

Read In English

అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:

ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.

రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.

అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X