ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్‌క్యామ్‌‌లా ఉపయోగించటం ఏలా..?

Posted By: Prashanth

How to Use Your Android Device As a Webcam?

 

ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలను అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా మలచటం ఏలా..? అనే అంశం పై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వెబ్‌క్యామ్ కోసం డబ్బులు వెచ్చించలేని వారికి ఈ మార్గం చక్కగా ఉపయోగపడుతుంది. కాకపోతే.. ఆండ్రాయిడ్ డివైజ్‌ను వెబ్‌క్యామ్‌గా మలచటం వల్ల బ్యాటీరీ శక్తి ఎక్కువుగా ఖర్చువుతుంది. కాబట్టి.. ఈ చర్యకు ఉపక్రమించే ముందు డివైజ్‌ను పూర్తి స్థాయిలో చార్జ్ చేసుకోవటం మంచింది.

విధానం:

మీ ఆండ్రాయిడ్ డివైజ్ వెబ్‌క్యామ్‌లా పనిచేయాలంటే ముందుగా రెండు సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంది. ‘ఐపీ వెబ్‌క్యామ్’ ( IP webcam), ఐపీ కెమెరా ఆడాప్టర్ ( IP Camera Adapter) అనే ఈ రెండు అప్లికేషన్‌లలో మొదటిది ఆండ్రాయిడ్ డివైజ్‌కు వర్తించగా రెండోది మీరు కనెక్ట్ చేసుకోబోయో విండోస్ ఆధారిత పీసీకి వర్తిస్తుంది.

ఈ రెండు అప్లికేషన్‌ల ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఈ క్రింది సూచనలను అనుసరించండి:

స్టెప్ 1: ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లోని ఐపీ వెబ్‌క్యామ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: ఐపీ వెబ్‌క్యామ్ విండోలో దర్శనమిచ్చే రిసల్యూషన్, ఓరియంటేషన్, ఎఫ్ పీఎస్ లిమిట్ వంటి సెట్టింగ్‌లను సరిచేసుకోవాలి.

How to Use Your Android Device As a Webcam?

స్టెప్ 3: సెట్టింగ్‌లను ఆడ్జస్ట్ చేసుకున్న వెంటనే తెర దిగువ భాగంలో మీకు మీరే స్టార్ట్ సర్వర్‌ను ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ 4: యూజర్ నేమ్ అదేవిధంగా పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం మంచింది. పలు సందర్భాల్లో ఆధారాలు చూడకుండా ఆడాప్టర్ స్పందించలేదు.

స్టెప్ 5: పోర్ట్ నెంబరు క్రింద ‘8080’ను ఉపయోగించండి.

Read In English

స్టెప్ 6: ఆండ్రాయిడ్ డివైజ్ తెర దిగువున కనిపించే ఐపీ అడ్రెస్‌ను మీకు నచ్చిన బ్రౌజర్‌తో డైరెక్ట్ చేసుకోవచ్చు.

How to Use Your Android Device As a Webcam?

స్టెప్ 7: మీ అవసరాలను అనుగుణంగా ఆప్షన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 8: వెబ్ బ్రౌజర్‌లో వీడియో లోడ్ అవటం ప్రారంభమవుతుంది.

స్టెప్ 9: ఇప్పుడు విండోస్ డెస్క్‌టాప్ పై ఇన్స్‌స్టాల్ చేసిన ఐపీ కెమెరా ఆడాప్టర్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 10: ఐపీ అడాప్టర్ అప్లికేషన్‌కు సంబంధించిన విండో ఓపెన్ అయిన వెంటనే ఐపీ అడ్రెస్, పోర్ట్ నెంబర్, రిసల్యూషన్, యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్ వంటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. కెమెరా ఫీడ్ యూఆర్ఎల్ సెక్షన్‌లో యూజర్ ‘http://(Type IP-Address here)/videofeed’ ఈ ఫార్మాట్‌ను అనుసరించాల్సి ఉంటుంది.

స్టెప్ 11: తరువాతి చర్యగా రిసల్యూషన్ సెట్టింగ్స్ కొరకు ఆటో డెటిక్ట్ ఆడ్జసెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

How to Use Your Android Device As a Webcam?

స్టెప్ 12: ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ‘apply’ బటన్ పై క్లిక్ చేయాలి.

స్టెప్ 13: ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ను వెబ్‌క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot