హెచ్‍పి10 ట్యాబ్లెట్@రూ.20,235

Posted By:

వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసకున్న హ్యులెట్ ప్యాకార్డ్ (హెచ్‌పి) 10 అంగుళాల డిస్‌ప్లే వేరింయట్‌లో సరికొత్త వాయిస్ కాలింట్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. హెచ్‌పి 10 ట్యాబ్లెట్ పేరుతో లభ్యమవుతున్న ఈ వాయిస్ కాలింగ్ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాన్ని ప్రముఖ  ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు రూ.19,990 నుంచి రూ.23,000 ధర శ్రేణిల్లో విక్రయిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే ఈ ట్యాబ్లెట్‌ను flipkart, ebay వంటి వెబ్‌సైట్‌లు రూ.20,235 ధరకు విక్రయిస్తున్నాయి. హెచ్‌పి 10 ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

హెచ్‍పి10 ట్యాబ్లెట్@రూ.20,235

3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ,
సింగిల్ సిమ్ కార్డ్‌స్లాట్ (జీఎస్ఎమ్ సపోర్ట్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
10 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4600ఎమ్ఏహెచ్ లితియమ్-పాలిమర్ బ్యాటరీ (5 గంటల వీడియో ప్లేబ్యాక్),
3జీ కనెక్టువిటీ, వై-ఫై, మైక్రో హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ పోర్ట్స్,
బ్లూటూత్ వీ3.0, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్,
ట్యాబ్లెట్ బరువు 632 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot